Site icon HashtagU Telugu

Bigg Boss 7 : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దామిని వీడియో.. నాగ్ ఏమంటాడో..?

Bigg Boss 7 Damini Video Vi

Bigg Boss 7 Damini Video Vi

బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) తెలుగులో ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. హౌస్ లో కంటెస్టెంట్స్ అంతా ఎక్కడెక్కడి వారో వస్తారు అక్కడ రూల్స్ ప్రకారం చిన్నా పెద్ద లాంటి వాటితో పాటుగా పర్సనల్ విషయాల గురించి ప్రస్థావించకూడదు. ఒకవేళ బిగ్ బాస్ టాస్క్ అయితే అది వేరే.. కానీ వ్యక్తి గత్ దూషణ మతాల గురించి మాట్లాడకూడదు.

కానీ రీసెంట్ Bigg Boss 7 ఎపిసోడ్ లో వినాయక చవితి సందర్భంగా హౌస్ లో ఉన్న దామిని అతను వచ్చి అక్షింతలు వేశాడని అని అన్నది. ఆ కామెంట్ మరో కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ మీద అన్నదని బిగ్ బాస్ చూస్తున్న వాళ్లందరికీ తెలిసిందే. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దామిని ఏ ఉద్దేశ్యంతొ యావర్ గుఇరించి అలా అన్నదని డిస్కస్ చేస్తున్నారు.బిగ్ బాస్ హౌస్ లో మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారా హౌస్ లో అలా అనడం ఏంటని కొందరు ఫైర్ అవుతున్నారు.

టాస్క్ ల విషయంలో యావర్ చూపిస్తున్న అగ్రెసివ్ నెస్ వల్లో దామిని అతని మీద కాస్త అసంతృప్తిగా ఉంది. ఆ టైం లో ఏదైనా మాట్ అని ఉండొచ్చు తప్ప ఆమె ఉద్దేశ్యం కూడా అది అయ్యి ఉండదు. కానీ బిగ్ బాస్ లో ఎప్పుడు ఏ చిన్న తప్పు దొరుకుతుందా అని ఎదురుచూసే వాళ్లకి అదే బూతద్ధం లో చూపించి పెద్దదిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న దామిని ఆల్మోస్ట్ ఎలిమినేషన్ పక్కా అని తెలుస్తుండగా ఆమె చేసిన ఈ కామెంట్ గురించి హోస్ట్ నాగార్జున క్లారిటీ తీసుకుంటారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈవారం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అవగా దామిని, శుభ శ్రీ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

Also Read : National Cinema Day : నేషనల్ సినిమా డే తేదీల్లో మార్పెందుకు..?