Sri Sri: కుదిరితే పరిగెత్తు.. అదీ చేతకాకపోతే పాకుతూ పో!

మహాకవి అనగానే ప్రతిఒక్కరికీ గుర్తుకువచ్చే పేరు శ్రీశ్రీ. ఆయన కలం నుంచి జాలువారిన కవితలు, పదాలు ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయి.

Published By: HashtagU Telugu Desk
Sri Sri

Sri Sri

మహాకవి అనగానే ప్రతిఒక్కరికీ గుర్తుకువచ్చే పేరు శ్రీశ్రీ. ఆయన కలం నుంచి జాలువారిన కవితలు, పదాలు ఎంతోమందికి ప్రేరణగా నిలిచాయి. బతుకుపై ఆశను నిలిపాయి. జీవితంలో పోరాడే శక్తినిచ్చాయి. ఇవాళ శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. 1910లో విశాఖ పట్నంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శ్రీరంగం శ్రీనివాసరావుకు పదిహేనేళ్ళ వయసులోనే వెంకట రమణమ్మతో వివాహం జరిగింది. ఆ తర్వాతే ఆయన 1931లో బి.ఎస్.సి., జువాలజీ చేశారు. ఆంధ్ర ప్రభలోనూ ఉద్యోగం చేసిన శ్రీశ్రీ 1933 -40 మధ్య కాలంలో రాసిన ‘మహా ప్రస్థానం’ గీతాలు ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. చిత్రసీమలోకి కాస్తంత ఆలస్యంగానే అడుగుపెట్టినా అక్కడా తనదైన శైలిలో అగ్నిజ్వాలలు కురిపించారు శ్రీశ్రీ.

కుదిరితే పరిగెత్తు.. లేకపోతే నడువు… అదీ చేతకాకపోతే… పాకుతూపో…. , అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు… ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని… అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే… తలుచుకుంటే… నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా… నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది, అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు…, పారే నది.., వీచే గాలి…, ఊగే చెట్టు…, ఉదయించే సూర్యుడు…. అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా….,, ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.., లే… బయలుదేరు… నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో… , పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు… నువ్వు పడుకునే పరుపు… నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్… , నీ అద్దం…. నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో… , నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్.., మళ్ళీ చెప్తున్నా… కన్నీళ్ళు కారిస్తే కాదు…, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో.. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే… అస్త్రాలు.

  Last Updated: 30 Apr 2022, 12:42 PM IST