Countries Vs Condoms : ఆరు దేశాల్లో కండోమ్స్‌పై బ్యాన్.. ఎందుకు ?

Countries Vs Condoms : సురక్షితమైన లైంగిక జీవితం కోసం.. ఎయిడ్స్ నుంచి రక్షణ కోసం.. కండోమ్స్ అత్యవసరం. కండోమ్స్ వినియోగంలోకి వచ్చాక.. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు కూడా బాగా తగ్గిపోయాయి.

  • Written By:
  • Publish Date - November 24, 2023 / 03:35 PM IST

Countries Vs Condoms : సురక్షితమైన లైంగిక జీవితం కోసం.. ఎయిడ్స్ నుంచి రక్షణ కోసం.. కండోమ్స్ అత్యవసరం. కండోమ్స్ వినియోగంలోకి వచ్చాక.. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ కారణాల రీత్యా కండోమ్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. కానీ కొన్ని దేశాలు కండోమ్స్ వినియోగంపై బ్యాన్ విధించాయి. ఇంతకీ ఏయే దేశాలు కండోమ్స్‌పై బ్యాన్ విధించాయి ? ఎందుకు విధించాయి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  • కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలో అన్నీ వెరైటీ చట్టాలే అమల్లో ఉంటాయి. అక్కడ కండోమ్‌లను ఉపయోగించడం చట్టవిరుద్ధమేం కాదు. కానీ వాటిని అమ్మడం చట్ట విరుద్ధం. దేశ జనన రేటును పెంచేందుకు కిమ్ ఈ ఆంక్ష విధించారు.
  • ఇండోనేషియాలో కండోమ్‌ల వాడకంపై సాంస్కృతిక నిషేధం అమల్లో ఉంది. అయితే దీనిపై చట్టపరమైన నిషేధం విధించాలని ఇండోనేషియా ఇస్లామిక్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
  • ఆఫ్రికాలోని నైజీరియా దేశంలో కండోమ్‌లను వాడటాన్ని అనైతిక చర్యగా పరిగణిస్తారు. కండోమ్‌లపై ఎక్కువగా ప్రచారం చేస్తే వ్యభిచారం పెరుగుతుందని నైజీరియా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అక్కడ కండోమ్‌లపై ప్రచారం చేయడం చట్టవిరుద్ధం.
  • ఆఫ్రికాలోని జాంబియా దేశంలో కండోమ్‌ల వినియోగంపై సాంస్కృతిక నిషేధం అమల్లో ఉంది. ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది క్రైస్తవులు. వారు మత విశ్వాసాల ప్రకారం కండోమ్‌లను ఉపయోగించడానికి ఇష్టపడరు. కండోమ్‌లను ఉపయోగించడాన్ని బలహీన చిహ్నంగా పరిగణిస్తారు.
  • ఆఫ్ఘనిస్తాన్‌లో కండోమ్‌లను విక్రయించడం, ఉపయోగించడం నిషేధం. తాలిబాన్లు ఈ చట్టాన్ని 2020 సంవత్సరం నుంచి కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ నిషేధం వెనుక బలమైన మత విశ్వాసం ఉంది.
  • ఫిలిప్పీన్స్  దేశంలో కండోమ్స్ వాడకం చాలా తక్కువ. ఇక్కడ కండోమ్స్ వాడకంపై సాంస్కృతిక నిషేధం ఉంది.  ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్ విశ్వాసాల వల్ల కూడా ఇక్కడ కండోమ్‌ల వినియోగం చాలా తక్కువగా(Countries Vs Condoms) ఉంది.