PM Modi Meditation Cave: మోడీ ధ్యానం చేసిన గుహకు క్రేజ్.. మే వరకు అడ్వాన్స్ బుకింగ్స్.. రెంట్ సహా పూర్తి వివరాలివి..

ప్రధాని మోదీకి ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు.. ఇందుకు ఒక లేటెస్ట్ ఉదాహరణ కూడా ఉంది. 2019 మే 18న ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ లో ప్రధాని మోదీ ధ్యానం చేసిన గుహకు క్రేజ్ ఎంతలా పెరిగిందంటే..

PM Modi Meditation Cave : ప్రధాని మోదీకి ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు.. ఇందుకు ఒక లేటెస్ట్ ఉదాహరణ కూడా ఉంది. 2019 మే 18న ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ లో ప్రధాని మోదీ ధ్యానం చేసిన గుహకు క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. మే నెల వరకు దానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయి. ప్రధానమంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ లో భాగంగా కేదార్‌పురి కొండలపై ధ్యానం కోసం మూడు ధ్యాన గుహలు నిర్మించారు. వాటిలో మోడీ ధ్యానం చేసిన గుహ కు బుకింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సమ్మర్ లో ఇక్కడికి టూర్ కు రాబోయే వాళ్ళు ఈ గుహలో ధ్యానం చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అంతలా అడ్వాన్స్ బుకింగ్స్ చేసు కుంటున్నారు. ఈ లెక్కన ఈసారి రికార్డు స్థాయిలో యాత్రికులు కేదార్ నాథ్ దర్శనానికి వస్తారని భావిస్తున్నారు. ఇక్కడ ధ్యానంతో పాటు ట్రెక్కింగ్‌ చేయడానికి కూడా భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

మోడీ (PM Modi) ధ్యాన గుహ కేదార్ నాథ్ ఆలయానికి 800 మీటర్ల దూరంలో, మందాకిని నదికి అవతలి వైపు, దుగ్ద్ గంగా సమీపంలో ఉంది.ఈ గుహ తర్వాత నిర్మించిన మరో రెండు గుహల బుకింగ్ ఆఫ్‌లైన్‌లో ఉంది. అంటే నేరుగా వచ్చి వాటి బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. యాత్రా కాలంలో ఈ గుహల కోసం బుకింగ్ కేదార్‌నాథ్‌లోని గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ అతిథి గృహంలో జరుగుతుంది.

మోడీ ధ్యానం చేసిన గుహ విశేషాలు

కేదార్‌నాథ్ కొండలపై ఉన్న సహజ గుహలు ధ్యాన గుహలుగా రూపొందించబడ్డాయి. 2018లో నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఒక గుహను నిర్మించారు. 2019లో మే 18న ప్రధాని నరేంద్ర మోదీ ఈ గుహలో ధ్యానం చేశారు. దీని తరువాత ఈ గుహ వైపు యాత్రికుల ఆకర్షణ గణనీయంగా పెరిగింది. 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు గల ఈ గుహ యొక్క బుకింగ్ మే వరకు పూర్తయింది.

సౌకర్యాలు..

  1. ధ్యాన గుహలలో సౌకర్యాల విషయానికి వస్తే.. వీటిలో విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ మరియు టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
  2. గుహను బుకింగ్ చేసుకున్న వ్యక్తికి GMVN ద్వారా ఒక సారి భోజనం మరియు టీ-స్నాక్స్ ఇస్తారు.
  3. 2018 సంవత్సరంలో నిర్మించిన మొదటి ధ్యాన గుహకు ఒక రోజు అద్దె 3000 రూపాయలు.దాని తర్వాత నిర్మించిన మిగిలిన రెండు ధ్యాన గుహలకు ఒకరోజు అద్దె రూ.1500.

“వాసుకీ తల్”

కేదార్‌నాథ్ కు వెళ్లే టూరిస్టులు అత్యంత ఇష్టపడే ట్రెక్కింగ్ మార్గం “వాసుకీ తల్” పెద్ద సంఖ్యలో ట్రెక్కర్లు ఇక్కడికి చేరుకుంటారు.  కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించిన తర్వాత, ప్రతి సంవత్సరం సగటున 50 వేల మంది యాత్రికులు “వాసుకీ తల్” ను సందర్శిస్తారు. సముద్ర మట్టానికి 4140 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ట్రాక్ కేదార్‌నాథ్ ఆలయం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

Also Read:  TOEFL Test Duration Reduced: ETS ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రావీణ్యత పరీక్ష రాసేవారి కోసం మార్పులను ప్రకటించింది