Arif & Sarus: తనను కాపాడిన మిత్రుడి దగ్గరికి చేరేందుకు పక్షి ఆరాటం.. తనకు అడ్డుగా ఇనుప కంచె..

ఉత్తర ప్రదేశ్‌‌లోని అమేథీకి చెందిన మహ్మద్ ఆరిఫ్, సారస్ కొంగ మధ్య స్నేహం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అది కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో.. అటవీ శాఖ అధికారులు అతడికి నోటీసులు ఇచ్చి కొంగను తీసుకొని వెళ్లారు.

Published By: HashtagU Telugu Desk
Arif And Sarus In Zoo

Arif And Sarus In Zoo

Arif & Sarus : ఉత్తర ప్రదేశ్‌‌లోని అమేథీకి చెందిన మహ్మద్ ఆరిఫ్, సారస్ కొంగ మధ్య స్నేహం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అది కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో.. అటవీ శాఖ అధికారులు అతడికి నోటీసులు ఇచ్చి కొంగను తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం కాన్పూర్‌లోని జూలో ఆ కొంగను ఉంచారు.

అటవీ అధికారుల అనుమతి తీసుకుని, కొంగను చూసేందుకు కాన్పూర్ జూకు ఆరిఫ్ (Arif) వెళ్లాడు. రెండు వారాల తర్వాత వెళ్లిన ఆరిఫ్‌ను చూసిన కొంగ వెంటనే గుర్తుపట్టింది. చూడగానే తల ఆడిస్తూ.. రెక్కలు కొడుతూ.. ఎగురుతూ.. ఎన్‌క్లోజర్‌లో అటు ఇటు తిరుగుతూ.. అతడి వద్దకు ఎలాగైనా సరే రావాలని ఆరాటపడింది. తన ప్రాణాలను కాపాడి, తనతో సావాసం చేసిన మిత్రుడిని కలిసేందుకు ఎన్‌క్లోజర్‌ నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కానీ వీలుకాలేదు.

జూ అధికారులు కొంగను చూసేందుకు మాత్రమే ఆరిఫ్ కు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో కొద్ది దూరం నుంచే ఆరిఫ్ చూస్తుండిపోయాడు. పక్షి ఆరాటాన్ని చూసిన నెటిజన్లు భావోద్వేనికి గురవుతున్నారు. ‘‘దయచేసి ఆ కొంగను వదిలిపెట్టండి. తిరిగి ఆరిఫ్ వద్దకు పంపండి’’ అని కోరుతున్నారు. ‘పక్షిని బంధించడం బాధిస్తోంది’ అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

గతంలో ఆరిఫ్‌కు పొలంలో నడవలేని, ఎగరలేని స్థితిలో సారస్ కొంగ కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకెళ్లి కాపాడాడు. కొద్ది రోజులు గదిలో ఉంచాడు. కోలుకున్న తర్వాత బయటికి వదలగా.. అది వెళ్లలేదు. అతడితోనే ఉండిపోయింది. ఆరిఫ్‌తో కలిసి తినడంతోపాటు.. అతడు ఎక్కడికి వెళ్తే.. అక్కడకు ఎగురుకుంటూ వెళ్లేది. బైక్ మీద వెళ్తున్న ఆరిఫ్‌ను కొంగ ఎగురుతూ అనుసరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సైతం ఆరిఫ్ ఇంటికి వెళ్లి.. కొంగతో అతడి స్నేహాన్ని చూసొచ్చారు. ఆ తర్వాత అటవీ అధికారులు కొంగను తీసుకెళ్లారు.జూలో ఆ కొంగను ఉంచారు.

Also Read:  IRDAI లో 45 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లాస్ట్ డేట్ మే 10

  Last Updated: 12 Apr 2023, 05:21 PM IST