Re KYC : బ్యాంకు అకౌంటుకు రీ కేవైసీ చేసుకోవాలా ? చాలా ఈజీ

కేవైసీ గురించి అందరికీ తెలుసు. రీ కేవైసీ అంటే ఏమిటి ?

  • Written By:
  • Updated On - June 8, 2024 / 11:55 AM IST

Re KYC :  కేవైసీ గురించి అందరికీ తెలుసు. రీ కేవైసీ అంటే ఏమిటి ? బ్యాంకులు కొందరు కస్టమర్లకు రీ కేవైసీ చేయించుకోవాలనే సూచన ఎందుకు ఇస్తుంటాయి ? ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

తమ కస్టమర్ల అకౌంట్లకు సెక్యూరిటీ కల్పించేందుకు.. సైబర్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ మోసాల నుంచి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే బ్యాంకులు రీ కేవైసీ చేయించుకోవాలని కోరుతుంటాయి. ఇలాంటి అలర్ట్ వచ్చినప్పుడు కస్టమర్లు గాబరాపడాల్సిన అవసరం లేదు. నేరుగా బ్యాంకుకు వెళ్లి.. తమ ఫోనుకు వచ్చిన మెసేజ్ నిజమైనదా ? కాదా ? అనేది తెలుసుకోవాలి. ఆ మెసేజ్ నిజమైనదే అని  బ్యాంకువాళ్లు చెబితే.. వెంటనే ఆన్‌లైన్‌లో రీ కేవైసీ చేసేందుకు ప్రాసెస్‌ను మొదలుపెట్టాలి. ఒక్కో బ్యాంకుకు సంబంధించిన రీ కేవైసీ ప్రక్రియ ఒక్కోలా ఉంటుంది. దీనిపై మనకు ప్రాథమిక అవగాహన ఉంటే.. చాలా ఈజీగా, స్పీడుగా దాన్ని పూర్తి చేయొచ్చు. ఇందుకోసం మనం ఓటర్‌ ఐడీ, పాన్‌ కార్డ్‌, భారత ప్రభుత్వం జారీ చేసిన ఈ- ఆధార్‌ లెటర్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఉపాధిహామీ జాబ్‌కార్డ్‌, పాస్‌పోర్ట్​లను చిరునామాగా, ఐడీ ప్రూఫ్‌గా(Re KYC) ఇవ్వొచ్చు.

Also Read :Nuclear Weapons Race : ఆ మూడు దేశాలతో దడ.. అణ్వాయుధాలను పెంచుతాం: అమెరికా

ఎస్​బీఐ

  • ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పోర్టల్‌లోకి లాగిన్ కండి.
  • ఇందులో ‘మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్’ అనే సెక్షన్ ఉంటుంది. ఇందులోకి వెళితే  ‘అప్ డేట్ కేవైసీ’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
  • అనంతరం మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఎంపిక చేసుకొని.. ‘నెక్ట్స్ ’ అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • తదుపరిగా కేవైసీ అప్​డేట్​కు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • సంబంధిత ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నింపి, అన్ని పత్రాలు జోడించి నేరుగా  బ్యాంకు శాఖలో కూడా ఇవ్వొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్​

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పోర్టల్‌‌ను ఓపెన్ చేయండి.
  • ఇందులోని పర్సనల్​ డీటైల్స్ విభాగంలోకి వెళ్లండి.
  • అందులో రీ-కేవైసీ అనే అంశంపై ఒక వెబ్ లింక్‌ ఉంటుంది.
  • రీ-కేవైసీ లింక్​పై క్లిక్ చేసి.. అందుకు అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్ లోడ్ చేయాలి.
  • సంబంధిత ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నింపి, అన్ని పత్రాలు జోడించి నేరుగా  బ్యాంకు శాఖలో కూడా ఇవ్వొచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్

  • ఐసీఐసీఐ నెట్‌ బ్యాంకింగ్‌ పోర్టల్‌లోకి తొలుత లాగిన్‌ కండి.
  • ఒకవేళ మీ కేవైసీ ఇంకా అప్ డేట్ కాకుంటే.. లాగిన్ కాగానే స్క్రీన్​పై ఆ అంశం కనిపిస్తుంది.
  • కేవైసీ ఆప్షన్ కనిపించగానే ఆథరైజేషన్ బాక్స్​పై టిక్ చేసి.. అప్ డేట్ థ్రూ డాక్యుమెంట్ అప్ లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • మీ కేవైసీ వివరాల్లో మార్పులు చేయదలిస్తే.. వాటిని అక్కడి బాక్సుల్లో నింపండి. ఆయా మార్పులకు ఆధారంగా ఉండే డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాలి.
  • చివర్లో మీ పాన్‌‌కార్డ్‌ను అప్‌లోడ్ చేయండి.
  • మీ అడ్రస్​ వివరాలను కూడా ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ పోర్టల్‌లో మార్చుకోవచ్చు.

Also Read : Ramoji Rao : అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ సంతాపం

Follow us