Cyber Crimes: లోన్ యాప్స్ అప్పులు తీసుకుంటున్నారా.. అయితే మీ ప్రాణాలకు ముప్పే

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 12:08 AM IST

Cyber Crimes: సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని తెలంగాణ పోలీసులు నెటిజన్లకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో పోలీసులు నేరాల గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతము అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడం జరుగుతుందని అవి జిల్లాలో పై స్థాయి అధికారుల ఫోటోలను వాట్సప్ డీపీలుగా మార్చుకొని కిందిస్థాయి ఉద్యోగులను డబ్బులు పంపమని వాట్సప్ మెసేజ్ లు చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని ఎవరు నమ్మరాదని పై స్థాయి అధికారులు ఎవరూ డబ్బులు అడగరని తెలిపారు. ఆన్లైన్ లోన్స్ గురించి లోన్స్ యాప్లను మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్లు ఫోటోలు మీ వ్యక్తిగత వివరాలు యాప్ వారు మీ అనుమతి లేకుండా తీసుకుంటారు.

తర్వాత మీరు తీసుకున్న లోన్ తిరిగి కట్టిన ఎక్కువ డబ్బులు కట్టమని ఆ వివరాలతో వేధింపులకు గురి చేస్తారు తస్మాత్ జాగ్రత్త అని ఆన్లైన్ లోన్ ఆప్స్ ద్వారా లోన్స్ తీసుకోరాదని సూచించారు.
లోన్ ఆప్స్ వేధింపులకు మీలో మీరే బాధపడవద్దు, క్షణికావేశాలకు పోవద్దు. మీ కుటుంబ సబ్యులకు, స్నేహితులకు చెప్పండి కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కస్టమర్ కేర్ నెంబర్ను సంబంధిత వెబ్సైట్ నుండి మాత్రమే తీసుకోవాలి సైబర్ నేరగాళ్లు గూగుల్ నందు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. పండుగలకు షాపింగ్‌ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్లలో వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని పలు జిల్లాల ఎస్పీలు సూచించారు.

లాటరీ కూపన్‌లో నమోదు చేసే ఫోన్‌ నెంబరు, మెయిల్‌ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఈ తరహా మోసాల బారినపడితే ఫోన్‌ చేయాలని అన్నారు. తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ లో కానీ ఇంస్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ వీడియో కాల్ చేసి ఫోటో లను న్యూడ్ ఫోటో లుగా మార్ఫింగ్ చేసి మీ బంధువులకి ఫోన్ చేస్తాము ,ఫోటోలు పంపిస్తాం ,యు ట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అంటూ ఇబ్బంది పెడుతున్నారు.