Summer Care: సమ్మర్ లో స్విమ్మింగ్ చేస్తున్నారా.. అయితే వీటితో జర జాగ్రత్త!

ఈత వల్ల ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 03:52 PM IST

ఎండాకాలం (Summer) వచ్చేసిందంటే పల్లెలతో పాటు పట్టణాల్లో స్విమ్మింగ్ (Swimming) పూల్స్ పిల్లలు, పెద్దలతో సందడి గా మారుతుంటాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈత వల్ల ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ లో దిగడం వల్ల వచ్చే అతి సాధారణమైన సమస్య చర్మం (Skin) పొడిబారడం. దీని వల్ల దురద కూడా పెడుతుంది. పూల్‌లో క్లోరిన్ వేస్తుంటారు. దీని వల్ల చర్మం దురద పెడుతుంది. కొంతమందిలో దద్దుర్లు కూడా వస్తాయి. కెమికల్ సెన్సిటివిటీ ఉన్నవారిలో దద్దుర్లు ఎక్కువగా బాధిస్తాయి.  స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువ సేపు ఈత కొడితే చర్మం మంటపుడుతుంది. సమ్మర్ లో ఈత కొట్టేముందే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

సన్‌స్క్రీన్‌ మస్ట్

చర్మంపై మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలని గుర్తుంచుకోండి. పూల్‌కు వెళ్లే కనీసం 20 నిమిషాల ముందు వాటర్ (Water) ప్రూఫ్ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలని వైద్యుల సూచిస్తున్నారు.

స్విమ్మింగ్ గ్లాసెస్

చాలా మంది కళ్ల కింద సన్‌స్క్రీన్ అప్లై చేస్తుంటారు. కానీ దానిని కింద అప్లై చేయడం మానుకోవాలి. బదులుగా మంచి స్విమ్మింగ్ గ్లాసెస్ (Glasses) వాడటం మంచిది.

చర్మం పొడిబారకుండా

స్విమ్మింగ్ పూల్ వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి మాయిశ్చరైజర్ చాలా కాపాడుతుంది. పూల్‌కి వెళ్లే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, ఇది చర్మంపై ఓ పొరను ఏర్పరుస్తుంది. దీని వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈత (Swim) కొట్టడానికి ముందు చర్మంపై డైమెథికాన్, గ్లిజరిన్, నూనెలు, పెట్రోలేటమ్ ఉన్న మాయిశ్చరైజర్ ను వాడాలని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు.

జుట్టు ఆరోగ్యం కోసం

చర్మంతో పాటు జుట్టు (Hair) ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే ముందు స్విమ్మింగ్ క్యాప్ తొడుక్కోవడం మర్చిపోవద్దు. పూల్‌లో ఉండే క్లోరిన్ వల్ల జుట్టు పాడవకుండా ఉండాలంటే క్యాప్ ధరించాల్సిందే.

ఈత కొట్టిన తర్వాత

ఈత కొట్టిన తర్వాత పూల్‌లోని క్లోరిన్ చర్మంపై పేరుకుపోతుంది. అందుకే ఈత కొట్టిన తర్వాత స్నానం (Bath) చేయాలని అంటారు. చర్మాన్ని శుభ్రం చేయడానికి తేలికపాటి క్లెన్సర్‌ని ఉపయోగించడం మంచిది.

మాయిశ్చరైజర్ రాసుకోవాలి

స్నానం చేసిన తర్వాత కూడా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్మిమ్మింగ్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ సమయంలో వేడిమి (Summer) ఎక్కువగా ఉండి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

Also Read: Indian Student Killed: కొలంబస్ లో భారత విద్యార్థి కాల్చివేత!