Milk Chemical: మీరు పాలు తాగుతున్నారా.. అయితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే..!

శవాలను (Dead bodies) భద్రపరచడానికి వాడే ఫార్మాల్డిహైడ్ అనే రసాయనాన్ని పాలలో కలుపుతున్నారు.

  • Written By:
  • Updated On - February 1, 2023 / 11:53 AM IST

మీరు పాలు (Milk) తాగుతున్నారా? అయితే ఒకటికి రెండు ఆలోచించుకోవాల్సిందే. పాలతో ఆరోగ్య ప్రయోజనాల కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే వరకు పాలలో నీళ్లు, ఇతర పొడి పదార్థాలను మిక్స్ చేస్తూ కలుషితం చేసేవాళ్లు. కానీ శవాలను (Dead bodies) భద్రపరచడానికి ఉపయోగించే ఫార్మాల్డిహైడ్ అనే ప్రాణాంతక రసాయనాన్ని పాలు, పాల ఉత్పత్తులలో కలుపుతున్నారు. గత ఆరు నెలలుగా హైదరాబాద్ (Hyderabad) వందలాది హోటళ్లకు ఫార్మాల్డిహైడ్‌తో కలిపి 600 లీటర్ల పాలను సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు.

యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలోని ఓ ప్రైవేట్ డైరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల పాల (Milk) పరీక్షల నివేదికలు అందిన తర్వాత పాలలో ఫార్మాల్డిహైడ్‌ కలుస్తున్నట్లు తెలియడంతో ఫుడ్‌ సేఫ్టీ, పోలీసు అధికారులు అవాక్కయ్యారు. బీబీనగర్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి మోసం, కల్తీ, నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని కేసులు నమోదు చేసినట్లు బీబీనగర్ ఇన్‌స్పెక్టర్ కె.సైదులు తెలిపారు.

తొలిసారిగా పాలలో ఫార్మాల్డిహైడ్ ఉన్నట్లు గుర్తించామని యాదాద్రి జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి తెలిపారు. పాలు (Milk) చెడిపోకుండా ఫార్మల్‌డిహైడ్‌ను వినియోగిస్తున్నట్లు పాల సేకరణ కేంద్రం మేనేజర్‌ నిందితుడు కడెం కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వినియోగదారులకు తక్షణ ముప్పు లేకపోయినా, పాలలో ఫార్మాల్డిహైడ్ రసాయనాలు కలిపితే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ఇది శ్వాసకోశ, జీర్ణకోశ, కాలేయ రుగ్మతలకు (Health Issues) దారితీస్తుందని యాదాద్రి జిల్లా సీనియర్ వైద్యుడు డాక్టర్ మధుసూధన్ రెడ్డి తెలిపారు. కల్తీ పాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జ్యోతిర్మయి, స్వాతి హెచ్చరించారు.

Also Read: Nepal Plane Video: నేపాల్ విమానం కూలడానికి ముందు ఏం జరిగిందంటే!