Family Pension : ఉద్యోగుల జీవితానికి పెన్షన్ భరోసా ఇస్తుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. ఉద్యోగులు తమ కుటుంబం కోసం ‘ఫ్యామిలీ పెన్షన్’ను(Family Pension) కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతకీ అదెలా ? తెలియాలంటే కథనం చదవండి.
We’re now on WhatsApp. Click to Join
నిబంధనల్లో ఏముంది ?
‘ఫ్యామిలీ పెన్షన్’ పద్ధతిని వ్యవస్థీకృత రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం అమలు చేస్తున్నారు. రిటైర్మెంట్ కంటే ముందే ఉద్యోగి చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ ఆదుకుంటుంది. సాధారణంగా ఉద్యోగులు తమ శాలరీలో 12 శాతాన్ని ఈపీఎఫ్ఓ అకౌంటులో జమ చేస్తుంటారు. వారు పనిచేసే కంపెనీ యజమాన్యం కూడా ప్రతి నెలా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ అకౌంటులో డిపాజిట్ చేస్తుంది. ఇలా జమయ్యే డబ్బును పదవీ విరమణ తర్వాత ఉద్యోగి తీసుకోవచ్చు. ఈ క్రమంలో రిటైర్మెంట్‌కు ముందే ఉద్యోగి చనిపోతే కుటుంబానికి పెన్షన్‌ను అందించడమే ‘ఫ్యామిలీ పెన్షన్’ లక్ష్యం.
Also Read :Bangladesh Protests : సుప్రీంకోర్టును చుట్టుముట్టిన బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు.. ఎందుకు ?
ఇవీ అర్హతలు..
- ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే కనీసం పదేళ్లపాటు కంపెనీలో పనిచేసి ఉండాలి.
- మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి ఈ ఫ్యామిలీ పెన్షన్‌కు ప్రధాన లబ్ధిదారుగా ఉంటారు. సదరు ఉద్యోగి భార్యకు పెన్షన్‌లో 50 శాతం లభిస్తుంది.
- మరణించిన సదరు ఉద్యోగికి 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇద్దరు పిల్లలుంటే వారికి చెరో 25 శాతం పెన్షన్ లభిస్తుంది.
- ఉద్యోగి చనిపోయాక అతడి జీవిత భాగస్వామి మళ్లీ పెళ్లి చేసుకుంటే నిబంధనలు మారుతాయి. అలాంటి టైంలో సదరు ఉద్యోగి పిల్లలు 25 ఏళ్లు వచ్చే వరకు 75 శాతం పెన్షన్‌ను పొందొచ్చు.
- శారీరక వైకల్యం కలిగి ఉన్న ఉద్యోగి పిల్లలు జీవితాంతం 75 శాతం మేర పెన్షన్‌ను పొందుతారు.
- పెళ్లి కాని ఉద్యోగి చనిపోతే.. అతడి/ ఆమె పేరెంట్స్ జీవితాంతం పూర్తి పెన్షన్‌ను అందుకుంటారు.
- ఉద్యోగి చనిపోయాక అతడి కుటుంబానికి శ్రీరామరక్షగా ఫ్యామిలీ పెన్షన్ నిలుస్తుందని చెప్పుకోవడంలో తప్పేం లేదు.