Traveling: ప్రయాణాలు అంటే భయపడిపోతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

కొంతమందికి మాత్రం ప్రయాణాలంటే భయాందోళనలు మొదలవుతాయి.

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 06:05 PM IST

కొంతమందికి మాత్రం ప్రయాణాలంటే భయాందోళనలు మొదలవుతాయి. సరదాగా ఏదైనా నచ్చిన ప్రదేశం చూసి రావాలన్నా వీరికి యాంగ్జయిటీ ఆటంకంగా మారుతుంది. ఈ పరిస్థితిని ట్రావెల్ యాంగ్జయిటీ, లేదా వెకేషన్ యాంగ్జయిటీ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ప్రయాణానికి ముందు లేదా ప్రయాణం చేస్తున్నపుడు ఒత్తిడికి, తీవ్రమైన అసౌకర్యానికి, ఆందోళనకు గురవుతుంటారు.

ప్రయాణం ఎలా జరుగుతుంది, వసతి సదుపాయాలు సరిగ్గా ఉంటాయా, ప్రయాణం సురక్షితంగా చేయగలమా… లాంటి ఆలోచనలతో ఉక్కిరిబిక్కరి అవుతుంటారు. విపరీతమైన ఆలోచనలతో వీరికి నిద్ర పట్టదు. విశ్రాంతి తీసుకోలేరు. మెదడునిండా ప్రయాణానికి సంబంధించిన ఆలోచనలే ఉంటాయి. ప్రయాణానికి ప్లాన్ చేసుకోవటం, సిద్ధం కావటం వారికి విపరీతమైన ఒత్తిడిని, అసహనాన్ని కలిగిస్తుంది. ప్రయాణానికి సంబంధించిన తేదీలు, వివరాలు, వస్తువులను పదేపదే చెక్ చేసుకుంటూ ఉంటారు. అన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా.. అని తమతో ఉన్నవారిని అడుగుతుంటారు.

రిలాక్సేషన్ వ్యాయామాలతో మనసులోని ఆందోళన తగ్గుతుంది. అలాగే తమకి నచ్చిన, ఇష్టమైన పనులతో కాలక్షేపం చేయటం వలన యాంగ్జయిటీ అదుపులో ఉంటుంది. ఆన్ లైన్ గేములు, నచ్చిన పుస్తకాలు, ఇష్టమైన సంగీతం… ఇవన్నీ ఆందోళనని తగ్గిస్తాయి. కొంతమందికి ఇల్లు వదిలి వెళ్లాలంటే ఆందోళన కలుగుతుంది. ఇల్లు పిల్లల బాధ్యతలు, పెంపుడు జంతువుల సంరక్షణ మొదలైన పనులను వదిలి వెళ్లాలంటే పడతారు. వీరు తమ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసుకోవటం ద్వారా యాంగ్జయిటీని తగ్గించుకోవచ్చు.

Also Read: Keerthy Suresh : తమిళ్ రాజకీయాల్లోకి కీర్తి సురేష్ ఎంట్రీ?