Site icon HashtagU Telugu

Tirumala Electric Bus: తిరుమలలో ఎలక్ట్రిక్‌ బస్సులు.. పొల్యుషన్ కు చెక్

Tirumala Bus

Tirumala Bus

త్వరలో తిరుమల తిరుపతిలో ఎలక్రిక్ బస్సులు రయ్ రయ్ మంటూ ఘాట్ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ఈ మేరకు బస్సుల ట్రయల్ రన్ కూడా జరిగింది. ఆర్టీసీ నిపుణులు అందులో ప్రయాణిస్తూ తిరుపతి నుంచి రెండో కనుమ దారి గుండా తిరుమలకు చేరుకున్నారు. ఎత్తైన ప్రదేశాలు, మలుపుల వద్ద బస్సు పనితీరును పరిశీలించారు. తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ బస్సు సర్వీసులను త్వరలో ప్రవేశపెట్టనున్నారు.

ఏబీఎస్‌, పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ సిస్టమ్‌తో నడిచే అత్యంత అధునాతన డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌తో బస్సును తయారు చేశారు. బస్సులో షార్ట్ సర్క్యూట్, మెరుపు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మోడల్ ఆధారంగా 32 నుంచి 36 మంది ప్రయాణికులు కూర్చోడానికి వీలుగా, ఎల్‌ఈడీ లైటింగ్ ఎల్‌ఈడీ డిస్ప్లేలతో కూడిన బస్సు రేపటి వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించి త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్ని స్తున్నారు.

తిరుమలకు సాధారణ భక్తులతో పాటు నిత్యం వీఐపీ,వీవీఐపీలు, విదేశాల నుంచి సగటున 89,000 మంది యాత్రికులు, ప్రతి 24 గంటలకు 10,000 వాహనాలు ఘాట్ సెక్షన్ టోల్ గేట్‌ను దాటుతున్నాయి. తిరుమలలో స్వచ్ఛమైన నీరు, గ్రీన్ లైటింగ్, పరిశుభ్రత, హౌస్ కీపింగ్ కార్యక్రమాలతో సహా పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు రూ.25 కోట్లు కేటాయించింది.