Site icon HashtagU Telugu

Anti Sikh Riots : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. ఎవరీ సజ్జన్ కుమార్ ? అసలేం జరిగింది ?

Anti Sikh Riots 1984 Sikh Massacre Congress Sajjan Kumar

Anti Sikh Riots 1984: ఢిల్లీలో సిక్కులపై 1984 సంవత్సరం నవంబరు 1న జరిగిన పాశవిక దాడుల ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ను ఢిల్లీలోని ఓ కోర్టు  బుధవారం రోజు దోషిగా తేల్చింది. ఆయనకు ఫిబ్రవరి 18న శిక్షను ఖరారు చేస్తామని ప్రకటించింది. ఇంతకీ ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు ఎందుకు జరిగాయి ? ఆ రోజు అసలేం జరిగింది ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :First Dalit CM : దేశంలోనే తొలి దళిత సీఎం మన ‘సంజీవయ్య’.. జీవిత విశేషాలు

1984 నవంబరు 1న ఢిల్లీలో ఏం జరిగింది ?

  • మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని 1984 అక్టోబరు 31న ఆమె ఇద్దరు బాడీగార్డులు దారుణంగా హత్య చేశారు. వాళ్లిద్దరూ సిక్కు వర్గానికి చెందినవారే.  అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇందిరాగాంధీ సర్కారు సైనిక ఆపరేషన్‌ను నిర్వహించినందుకు ప్రతీకారంగా ఈ హత్యకు పాల్పడ్డారు.
  • ఇందిరా గాంధీ హత్య జరిగిన మరుసటి రోజున (1984 నవంబర్‌ 1న) ఢిల్లీలోని సరస్వతీ విహార్‌ ప్రాంతంలో ఉన్న సిక్కుల నివాసాలపై అల్లరి మూకలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు.
  • ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు(Anti Sikh Riots 1984), దోపిడీలు, గృహదహనాలు జరిగాయి.
  • సరస్వతి విహార్‌ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను ఓ అల్లరిమూక హత్య చేసింది. ఆ అల్లరిమూక గుంపునకు మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ నాయకత్వం వహించాడని తాజాగా ఢిల్లీ కోర్టు తేల్చింది. ఇందుకు తగిన సాక్ష్యాలు కూడా లభించాయని వెల్లడించింది.
  • ఈ కేసులో 2021 డిసెంబర్‌ 16న సజ్జన్‌కుమార్‌పై అభియోగాలు నమోదయ్యాయి. మూడేళ్ల పాటు  విచారణ జరిపిన కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది.

Also Read :GHMC Jumpings : ‘గ్రేటర్’ స్టాండింగ్ కమిటీ పోల్స్.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలం ఎంత ?