Site icon HashtagU Telugu

Andhra Girl: భారత్- ఆస్ట్రేలియా టీ20కి ‘ఆంధ్రా’ అమ్మాయి సెలక్ట్!

Andhra Cricket

Andhra Cricket

మహిళలు అన్ని అడ్డంకులను అధిగమించి ఏ రంగంలోనైనా మగవాళ్ల కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు. బాలికలు కూడా క్రీడల్లోకి ప్రవేశించి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆడపిల్లలు క్రికెట్ వంటి క్రీడల్లోకి రాణిస్తున్నారు. మిథాలీ రాజ్ లాంటి దిగ్గజ మహిళా క్రికెటర్స్ ను మనం చూశాం. అద్భుతమైన బ్యాటింగ్ తో సచిన్ టెండూల్కర్ లా పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎంపికైంది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారతదేశంలోని క్రికెట్ గవర్నింగ్ బాడీ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) జట్టును ప్రకటించింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన అంజలి సర్వాణి కూడా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అంజలి సర్వాణి అద్భుతంగా ఆడటంతో జట్టులో చోటు సంపాదించేలా చేసింది.

ఏపీలో అదోనిలో జన్మించిన క్రీడాకారిణి ఫాస్ట్ బౌలర్ స్కిల్స్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఆమె లెఫ్ట్ ఆర్మ్ పేసర్. దేశీయ క్రికెట్‌లో ఎన్నో వికెట్లు పడగొట్టి తానేంటో నిరూపించుకుంది. ఈ నెల 9న సిరీస్ ప్రారంభం కానుండగా, మహారాష్ట్ర ఆతిథ్యమివ్వనుంది. T20 ప్రపంచ కప్ 2023కి ముందు సిరీస్ ఆడనున్నందున అందరి దృష్టి సిరీస్‌పైనే ఉంది. జట్లు ఇప్పటికే సిరీస్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించాయి. దీంతో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాయి ఇరుజట్లు.

Exit mobile version