నెదర్లాండ్స్ రాజధాని…ఆమ్‌స్టర్‌డ్యామ్…!! ఈ నగరం చూడటానికి ఎంతో అందంగా అద్బుతంగా ఉంటుంది. ఎటుచూసినా అందమైన కాలువలు, సుందరమైన వీధులు, మ్యూజియాలు, అలరారే ఈ నగరాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు వస్తుంటారు. భూతల స్వర్గాన్ని తలపించే ఈ అందమైన నగరానికి ఓ మాయని మచ్చ ఉంది. దీనిని సిటి ఆఫ్ సిన్ కూడా పిలుస్తుంటారు. అంటే పాపపు నగరం అని అర్థం. అలా ఎందుకు పిలుస్తారు అనడానికి ఓ కారణం కూడా ఉంది. ఇక్కడ వ్యభిచారం చట్టబద్ధమైంది. గంజాయి వాడకం నేరం కాదు. ఇవే అక్కడ పెద్ద ఆదాయ వనరులు. ఈ నేపథ్యంలో ఆమ్‌స్టర్‌డ్యామ్ అందాలను ఆస్వాదించడమే కాదు…అమ్మాయిలు, డ్రగ్స్ కోసం కూడా పర్యాటకులు పెద్దుత్తున ఇక్కడి వస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే నగర్ మేయర్ ఎమ్కే హల్సేమా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఆమ్‌స్టర్‌డ్యామ్ అందాలు చూసేందుకు మ్యూజియంలను తిలకించేందుకు లేదంటే ఇక్కడి సంప్రదాయాలను తెలుసుకునేందుకు రండి. కానీ నైతికతను కోల్పోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి రాకండి అంటూ వ్యాఖ్యానించారు. నగరం చాలా మంది నాన్ రెసిడెంట్లకు మాత్రమే వసతి కల్పిస్తోందన్న ఆమె…వీరి కారణంగా నగర జీవనం మరింత ఖరీదైనదిగా మారుతుందన్నారు. కాబట్టి శ్రుంగారం కోసం, డ్రగ్స్ కోసం ఇక్కడికి రావద్దని పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు.