నేర ప్రపంచంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. వారు వివిధ నేరాలకు పాల్పడుతుంటారు. అయితే నేరాలు చేయడం కోసమే జీవించే సైకోలు కొందరు ఉంటారు. ఒకరి ప్రాణం తీయడం వారికి ఆట మాత్రమే అవుతుంది. సాధారణ భాషలో, అటువంటి భయంకరమైన వ్యసనం ఉన్నవారిని సీరియల్ కిల్లర్స్ అంటారు. వారు ఒకరి తర్వాత మరొకరిని వెతికి వెతికి చంపేస్తుంటారు. ఈ రోజు అటువంటి భయంకరమైన సీరియల్ కిల్లర్ కథ ఒకటి తెలుసుకుందాం. ఆ మానవ మృగం పేరు “జెఫ్రీ డామర్”.
జెఫ్రీ డామర్ ఎవరు?
జెఫ్రీ డామర్ 1960 మే 21న అమెరికాలోని విస్కాన్సిన్‌లో జన్మించాడు. అతని తండ్రి, లియోనెల్ హెర్బర్ట్ డామర్, పరిశోధనా రసాయన శాస్త్రవేత్త. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు జెఫ్రీ డామర్ ను
పెద్దగా పట్టించుకోలేదు. ఈ కారణంగా జెఫ్రీ తనను తాను ఒంటరిగా భావించేవాడు.
నిజానికి, జెఫ్రీ మొదటి తరగతికి చేరుకున్నప్పుడు.. అతని తండ్రి లియోనెల్ పరిశోధన మరియు చదువు కోసం ఎక్కువగా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది. అతని తల్లి జాయిస్ హైపోకాండ్రియాక్ లాగా డిప్రెషన్‌తో బాధపడేది. దీంతో ఆమె జెఫ్రీ పెంపకంపై దృష్టి పెట్టలేకపోయేది. ఫలితంగా, తల్లిదండ్రులు తమ కొడుకు జెఫ్రీకి ఎక్కువ సమయం ఇవ్వలేదు.దాని కారణంగా అతని ఒంటరితనం పెరిగింది.
వాస్తవానికి జెఫ్రీ తన తోటి పిల్లలతో ఎంతో కలివిడిగా ఉండేవాడు. అయితే అతడి నాల్గవ పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందు.. ఆరోగ్య సమస్య వల్ల ఒక సర్జరీని చేయించారు. ఆ తర్వాత కూడా అతడు చాలా శాంతంగా ఉండేవాడు. ఈక్రమంలో బడిలో కొందరు పిల్లలు జెఫ్రీని పిరికివాడు అని వెక్కిరించే వారు. కానీ తండ్రి ఇంటికి దూరంగా ఉండటం, తల్లికి ఆరోగ్య సమస్యల కారణంగా జెఫ్రీ
పిరికిగా తయారవుతున్నట్లు అతని ఉపాధ్యాయుడు ఒకరు గుర్తించారు. స్కూల్లో అతని స్నేహితుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండటాన్ని ఆయన గమనించారు.
మరోవైపు జరగ రానిది జరిగిపోయింది. జెఫ్రీలో ఒక కీలక మార్పు వచ్చింది. ఐదేళ్ల వయస్సులో జెఫ్రీకి..
చనిపోయిన జంతువులు, వాటి ఎముకలపై ఆసక్తి పెరిగింది. తన తండ్రి జంతువుల ఎముకలను బ్లీచింగ్ చేయడం, శుభ్రం చేయడం , వాటిని భద్రంగా ఉంచడాన్ని జెఫ్రీ చూసేవాడు. ఒకసారి డిన్నర్ సమయంలో, జెఫ్రీ తన తండ్రి లియోనెల్‌ని కోడి ఎముకలను బ్లీచ్‌లో పెడితే ఏమి జరుగుతుందని అడిగాడు. ఈ ప్రశ్న తన కుమారుని శాస్త్రీయ ఉత్సుకతగా భావించి.. లియోనెల్ అతనికి సురక్షితంగా బ్లీచ్ చేసి భద్రపరిచిన జంతువుల ఎముకలను చూపించాడు. ఈరకంగా జెఫ్రీ ఇవన్నీ నేర్చుకున్నాడు.
ఆ ఇంట్లోకి మారాక.. సైకోగా..
1966 అక్టోబర్లో జెఫ్రీ కుటుంబం ఒహియో రాష్ట్రంలోని డోయిల్‌స్టౌన్‌కి మారింది. ఆ సంవత్సరం డిసెంబరులో అతని తల్లి జాయిస్ తన సోదరుడికి జన్మనిచ్చింది. తమ్ముడికి మంచి పేరు పెట్టమని జెఫ్రీని అతని తల్లి సూచించింది.దీంతో అతను తన తమ్ముడికి డేవిడ్ అని పేరు పెట్టాడు. అదే సంవత్సరంలో.. జెఫ్రీ
తండ్రి లియోనెల్, తన డిగ్రీని సంపాదించి ఓహియోలోని అక్రోన్‌లో రసాయన శాస్త్రవేత్తగా ఉద్యోగం పొందారు.1968లో జెఫ్రీ
కుటుంబం ఒహియోలోని సమ్మిట్ కౌంటీలోని బాత్ టౌన్‌షిప్‌కి మారింది. రెండేళ్లలో ఇది ఆయన మూడో చిరునామా. అక్కడ అతని ఇల్లు ఒకటిన్నర ఎకరాల అడవి మధ్యలో ఉండేది. ఈ ఇంటికి కొంచెం దూరంలో చిన్న గుడిసె ఉండేది. జెఫ్రీ తూనీగలు, చిమ్మటలు, చిప్మంక్స్, ఉడుతలు వంటి వాటి అస్థిపంజరాలను సేకరించి ఈ గుడిసెలో పెట్టేవాడు.
ఫార్మాల్డిహైడ్ రసాయనం నింపిన ఒక కూజాలో ఈ అస్థిపంజరాలను దాచేవాడు.
సైకోయిజం ఇలా పెంచుకున్నాడు..
యుక్తవయస్సులో ఉన్నప్పటికి.. జెఫ్రీలో చాలా మార్పులు వచ్చాయి. జంతువులను చంపి వాటి శరీరాలను ముక్కలుగా కోసేవాడు. తర్వాత వాటిని పాతిపెట్టేవాడు. కొన్నిసార్లు అతను వాటి మృతదేహాలను అలంకరించి ఆనందించేవాడు. కానీ 18 ఏళ్ల వయసులో అంటే 1978లో తొలిసారిగా.. ఓ వ్యక్తిని జెఫ్రీ చంపేశాడు. వాస్తవానికి కౌమారదశలోకి వచ్చిన తర్వాత.. అతను స్వలింగ సంపర్కుడని జెఫ్రీ గ్రహించాడు. అతను అమ్మాయిలకు బదులుగా అబ్బాయిలను ఇష్టపడటం ప్రారంభించాడు. కొందరు ప్రత్యేకమైన అబ్బాయిలను అతడు ఆకర్షించేవాడు.
స్టీవెన్ హిక్స్ మొదటి బాధితుడు..
స్టీవెన్ హిక్స్ అనే అబ్బాయిపై జెఫ్రీ మోజు పడ్డాడు. అతడిని ఒక రాక్ కచేరీ దగ్గర జెఫ్రీ కలిశాడు. అతడిని జెఫ్రీ తన ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి వచ్చాక ఇద్దరు కలిసి బీర్ తాగారు. కొన్ని బీర్లు తాగిన తర్వాత, స్టీవెన్ ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్లు జెఫ్రీకి చెప్పాడు. కానీ జెఫ్రీ నో అన్నాడు. 4.5 కిలోల డంబెల్‌తో స్టీవెన్ హిక్స్
తలపై కొట్టి జెఫ్రీ హత్య చేశాడు.
స్టీవెన్ హిక్స్ మరణం తర్వాత, జెఫ్రీ తన బట్టలు తీసి అతని మృతదేహంపై నిలబడి హస్తప్రయోగం చేశాడు. దీని తర్వాత, అతను స్టీవెన్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి చెత్త సంచుల్లో నింపాడు.
17 మంది అబ్బాయిలను చంపాడు
1978 నుండి 1991 వరకు జెఫ్రీ డామర్ 17 మంది స్వలింగ సంపర్కులను చంపాడు. వారిలో కొందరు కేవలం 14 ఏళ్ల పిల్లలే. మనుషులను చంపిన తర్వాత వారి మార్కులను కూడా సేకరించేవాడు. జెఫ్రీ ఎక్కువగా నలుపు, ఆసియా, లాటిన్ పురుషులను తన టార్గెట్ గా ఎంచుకునేవాడు. జెఫ్రీ తన బాధితులను ఎక్కువగా గే బార్‌లు, మాల్స్ , బస్టాప్‌ల నుండి ఎన్నుకునేవాడు. డబ్బు లేక సెక్స్ అనే దురాశతో వారిని ఇంటికి తీసుకొచ్చి మద్యం తాగించి.. మత్తు మందు ఇచ్చి చంపేవాడు. చనిపోయిన తర్వాత అతడి మృతదేహంతో లైంగిక సంబంధం పెట్టుకునేవాడు. తన కామాన్ని చల్లార్చిన తర్వాత, అతను వారి శరీరాలను ముక్కలుగా కోసేవాడు. చాలా సార్లు అతను తన బాధితుడి శరీరం యొక్క తల, మర్మాంగాన్ని జ్ఞాపకంగా తన వద్ద ఉంచుకునేవాడు. తాను చంపిన వాళ్ళ ఎముకలను 57-గ్యాలన్ల డ్రమ్‌లో వేసి పొడిగా చేసేవాడు.
తద్వారా సాక్ష్యాలను నాశనం చేసేవాడు.
సజీవంగా ఉన్న బాలుడి తలలో యాసిడ్ నింపి
జెఫ్రీ ఒకసారి ఎర్ల్ లిండ్సే అనే 19 ఏళ్ల యువకుడిని తన టార్గెట్ గా చేసుకున్నాడు.అతడి తలపై జెఫ్రీ పొడిచి.. అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ నింపాడు. దీంతో వెంటనే ఆ యువకుడు ప్రానాలు విడిచాడు. జెఫ్రీ తాను చంపిన వారి శరీర మాంసం కూడా తినేవాడని అంటారు.
ఆర్మీలో ఉండగా..
అంతకుముందు కొంత కాలం పాటు జెఫ్రీ ఆర్మీ లో కూడా పనిచేశాడు.
అక్కడ కూడా తన కామ వాంఛలు నెరవేర్చుకున్నాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిలో ఒకరు ఇంతకుముందు జెఫ్రీ గత బాధితురాలి యొక్క సోదరుడే.
జైలులో జెఫ్రీ మర్డర్..
హత్యలు చేసినప్పుడు జెఫ్రీ డామర్ తన బాధితుల ఫోటోలు తీయడం అలవాటు చేసుకున్నాడు . ఈ ఫోటోలను అతడు డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రీజర్‌లో ఎక్కువగా ఉంచాడు. వీటిలో పురుషులు బట్టలు లేకుండా, విభిన్నంగా మరియు శరీర భాగాలను వేరు చేసిన ఫోటోలు ఉన్నాయి. బాధితుల మృత దేహాన్ని శృంగార భంగిమలో ఉంచి ఫోటోలు తీయడం జెఫ్రీకి అలవాటు. కేవలం అతడు తీసిన ఫొటోల వల్లే జెఫ్రీ పోలీసులకు చిక్కినట్లు సమాచారం.పోలీసులకు దొరికిన తర్వాత అతను అనేక కేసుల్లో జీవిత ఖైదును అనుభవించాడు. అంటే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వచ్చింది. జైలులో ఉన్నప్పుడు, జెఫ్రీ తన నేరాలన్నింటినీ అంగీకరించాడు. చివరకు జెఫ్రీ డామెర్ జైలులో చంపబడ్డాడు . కొలంబియా కరెక్షనల్ ఫెసిలిటీలో మూడు సంవత్సరాల నాలుగు నెలలు గడిపిన తర్వాత, అతను హత్య చేయబడ్డాడు. జెఫ్రీని అతని జైలు సహచరుడు క్రిస్టోఫర్ స్కార్వర్ 28 నవంబర్ 1994న ఇనుప డంబెల్‌తో కొట్టి చంపాడు.
వెబ్ సిరీస్ వచ్చింది..
జెఫ్రీ జీవితం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్ వచ్చింది. దీని పేరు “మాన్స్టర్: ది జెఫ్రీ డామర్”. ఈ వెబ్ సిరీస్ గే సీరియల్ కిల్లర్ జెఫ్రీ కథలోని ప్రతి అంశాన్ని ప్రేక్షకుల ముందు ప్రదర్శించడానికి ప్రయత్నించింది.