Site icon HashtagU Telugu

RBI Orders: మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు ఓపెన్.. RBI ఆదేశాలు.. ఏప్రిల్ 1, 2 బ్యాంక్స్ క్లోజ్

RBI Penalty

All Banks Open Till March 31.. Rbi Orders.. April 1, 2 Banks Close

అన్ని బ్యాంకుల శాఖలు మార్చి నెలలో 31 వరకు తెరిచే ఉంటాయి. మార్చి 31 వరకు తమ బ్రాంచీలను తెరిచి ఉంచాలని బ్యాంకులను RBI ఆదేశించింది. దీనితో మీరు ఇప్పుడు ఆదివారం కూడా బ్యాంకు సంబంధిత పనులను చేసుకో గలుగుతారు. మార్చి 31 తర్వాత వరుసగా రెండు రోజులు అంటే ఏప్రిల్ 1, 2 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. 2022 – 23 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుందని RBI తెలిపింది.  ప్రభుత్వ సంబంధిత లావాదేవీలన్నీ ఈ తేదీలోగా క్లియర్ అవుతాయి.  అదే సమయంలో.. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) సిస్టమ్ ద్వారా లావాదేవీలు మార్చి 31న అర్ధరాత్రి 12 గంటల వరకు కొన సాగుతాయని RBI తెలిపింది.

ప్రభుత్వ చెక్కుల సేకరణ కోసం ప్రత్యేక క్లియరింగ్

ప్రభుత్వ చెక్కుల సేకరణ కోసం ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించ బడుతుంది.దీని కోసం చెల్లింపు మరియు సెటిల్‌మెంట్ సిస్టమ్స్ విభాగం (DPSS) అవసరమైన సూచనలను జారీ చేస్తుంది. DPSS RBI కిందకు వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లావాదేవీలను నివేదించడానికి రిపోర్టింగ్ విండో మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకు తెరిచి ఉంటుంది.

మార్చి 31లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయండి

మీరు ఇంకా మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే.. మార్చి 31లోపు పూర్తి చేయండి. అలా చేయడంలో విఫలమైతే మీ పాన్ డీయాక్టివేట్ అవుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) 2022 జూన్ 30 నుంచి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి రూ. 1000 ఆలస్య రుసుమును వసూలు చేస్తోంది.

PPF, సుకన్య ఖాతాలలో కనీస బ్యాలెన్స్ జమ చేయండి

మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) , సుకన్య సమృద్ధి యోజన (SSY) ఖాతాలను కలిగి ఉంటే వాటిలో కనీస అమౌంట్ జమ చేయండి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలోపు కనీస డబ్బు డిపాజిట్ చేయలేకపోతే.. మార్చి 31 వరకు ఖాతా డీ యాక్టివేట్ అవుతుంది. మీరు కనీస అవసరమైన మొత్తాన్ని ఉంచకపోతే, వాటిని మళ్లీ యాక్టివేట్ చేయడానికి జరిమానా చెల్లించాలి. మీ ఖాతా యాక్టివ్‌గా ఉందని తెలుసు కోవడానికి మీరు మీ ఈ పథకాలలో కనీస పెట్టుబడిని కొనసాగించాలి.

Also Read:  SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.206.50 కట్.. ఎందుకంటే?