Site icon HashtagU Telugu

ANR Family : అక్కినేని ఫ్యామిలీ కే ఎందుకు ఇలా జరుగుతుంది..? ఏమైనా దోషాలున్నాయా..?

Anr Family

Anr Family

చిత్రసీమలో అక్కినేని ఫ్యామిలీ (ANR Family) అంటే ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవం. అక్కినేని నాగేశ్వరావు (Akkineni Nageswara Rao) నుండి అఖిల్ వరకు ఈ ఫ్యామిలీ లో ఎంతోమంది చిత్రసీమకు మేలు చేస్తున్న వారు ఉన్నారు. ఆనాడు చెన్నై నుండి తెలుగు చిత్రసీమ హైదరాబాద్ కు తరలిరావడం లో నాగేశ్వరావు పాత్ర ఎంతో ఉంది. ఈరోజు టాలీవుడ్ ప్రపంచంలోనే గుర్తింపు సాధించిందంటే దానికి నాగేశ్వరావు చేసిన కృషి ఎంతో అంతోఇంతో ఉంది. ఆనాడు ఎన్టీఆర్ , నాగేశ్వరావు , కృష్ణ , కృష్ణం రాజు , కాంతారావు , రంగారావు , శోభన్ బాబు ఇలా ఎంతోమంది సీనియర్ అగ్రనటులు టాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో పాలుపంచుకున్నారు.

నాగేశ్వరావు విషయానికి వస్తే..ఒక రైతు కుటుంబంలో పుట్టి, నాటకరంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్రనాయకులలో ఒకడు. సుమారు 255 చిత్రాల్లో నటించాడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల తెలుగు, తమి‌ళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించాడు. ఎన్టీఆర్ తో పాటు తెలుగు సినిమాకి మూల స్తంభంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు ఫిల్మ్ ఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు , భారతీయ సినీరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ను ANR అందుకున్నారు.

ఆయన మాత్రమే కాదు ఆయన ఫ్యామిలీ నుండి కూడా కుమారులను , మనవళ్లను , మానవరాళ్లను చిత్రసీమకు పరిచయం చేసాడు. నాగార్జున (Nagarjuna) హీరోగా , నిర్మాతగా రాణిస్తున్నాడు. మరో కుమారుడు వెంకట్ సైతం బిజినెస్ లు , సినిమాల తాలూకా వ్యవహారాలు చూసుకుంటున్నాడు. నాగ చైతన్య , అఖిల్ లు సైతం హీరోలుగా రాణిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది…కానీ ఈ మధ్య అక్కినేని ఫ్యామిలీ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా అక్కినేని హీరోల పెళ్లి ముచ్చట అనేది మూడునాళ్ల ముచ్చటగానే అవుతుండడం అందరికి అనేక అనుమానాలు కలిగిస్తుంది. నాగార్జున రెండో పెళ్లి ..నాగచైతన్య అదే బాట..అఖిల్ సైతం అంతే ఎంగేజ్మెంట్ అయ్యాక..పెళ్లి తంతు ఆగిపోయింది. చైతు కూడా ముందు సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి..ఇప్పుడు శోభిత తో ఏడు అడుగులు వేసేందుకు సిద్దమయ్యాడు. సుమంత్ కూడా అంతే..ఇలా ప్రతి ఒక్కరు పెళ్లిళ్ల విషయంలో రెండో స్టెప్ వేశారు. తాజాగా N కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని చెప్పి ప్రభుత్వం కూల్చేసింది..ఇక నిన్నటి నుండి అక్కినేని ఫ్యామిలీ ఫై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇలా వరుస వివాదాలు , ఆరోపణలు అక్కినేని ఫ్యామిలీ ని వెంటాడుతుండడంతో అభిమానులు కలవరపడుతున్నారు. ఎందుకు అక్కినేని ఫ్యామిలీ కే జరుగుతుంది..? ఏమైనా దుషలు ఉన్నాయా..? అని మాట్లాడుకుంటున్నారు.

Read Also :

Akkineni Nageswara Rao