Bhadradri: ‘ఆదిలక్ష్మి గ్యారేజీ’ (ఇచ్చట అన్నిరకాల పంక్చర్లు వేయబడును)

నేటితరం మహిళలు ఎలాంటి కష్టసాధ్యమైన పనులను చేయడానికి కూడా వెనుకాడటం లేదు. నింగి, నేల అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు.

  • Written By:
  • Updated On - March 23, 2022 / 12:24 PM IST

నేటితరం మహిళలు ఎలాంటి కష్టసాధ్యమైన పనులను చేయడానికి కూడా వెనుకాడటం లేదు. నింగి, నేల అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సాధారణంగా మెకానిక్ ఫీల్డ్ అంటేనే చాలామంది ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన ఈమె బరువైన వాహనాలను పంక్చర్లు వేస్తూ శభాష్ అనిపించుకుంటోంది. చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సాఫీగా సాగించేందుకు ఆదిలక్ష్మి సహాయం చేసింది. అయితే గ్యారేజ్ కు వెళ్లే ప్రయాణికులు ఆదిలక్ష్మీని చూసి షాక్ అవుతారు. కానీ పెద్ద పెద్ద టైర్‌లను బిగించడంలో ఆదిలక్ష్మి నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుంటారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్‌లో ‘ఆదిలక్ష్మి గ్యారేజీ’ ఉంది. ఆ ప్రాంత పరిసరాల్లో ఎలాంటి వాహనం పంక్చర్ అయినా అక్కడికే వస్తాయి. 31 ఏళ్ల యద్దలపెల్లి లక్ష్మి ఐదేళ్లుగా ఈ పనిచేస్తోంది. తన భర్త భద్రం ద్వారా మెకానిక్ స్కిల్స్ నేర్చుకుంది. ఆమె లారీలు, కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల టైర్లకు పంక్చర్ మరమ్మతులు చేయగలదు. తన భర్త వేరే చోట పంక్చర్ పనులకు వెళ్లినప్పుడు గ్యారేజ్ బాధ్యతలను చూసుకునేది. రెండు నెలలుగా నా భర్త చేసే పనిని గమనించి నేనే ఆ పని చేయడం మొదలుపెట్టాను’’ అని అంటోందీమె.

ఆమె IV తరగతి వరకు మాత్రమే చదువుకుంది, కానీ ఆమె తన ఇద్దరు పిల్లల కోసం పెద్ద కలలు కంటుంది. అంతేకాదు.. తన చెల్లెళ్ల బాధ్యతలను చూసుకుంటోంది. టీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత లక్ష్మికి లారీ టైర్‌ మార్చే యంత్రాన్ని ఇచ్చినా ఆ యంత్రం నడపడానికి వీలుగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ఆమె దానిని వినియోగించలేకపోయింది. ఇంతవరకు రేషన్ కార్డు లేని తనకు ప్రభుత్వం సాయం చేయాలని, డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని దీనంగా కోరుకుంటోంది.