Water On Earth: భూమిపైకి నీళ్లు తీసుకొచ్చిన భగీరథులు అవేనట.. గుట్టు విప్పిన జపాన్ సైంటిస్టులు!!

భూమిపైకి నీరు ఎలా వచ్చింది ? ఇతర ఏ గ్రహాల్లోనూ లేని నీరు కేవలం మన భూగ్రహంపైనే ఎలా ఉంది?

  • Written By:
  • Publish Date - August 18, 2022 / 10:47 AM IST

భూమిపైకి నీరు ఎలా వచ్చింది ? ఇతర ఏ గ్రహాల్లోనూ లేని నీరు కేవలం మన భూగ్రహంపైనే ఎలా ఉంది? ఇందులో దాగి ఉన్న మిస్టరీ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ జపాన్ కు చెందిన అంతరిక్ష పరిశోధకులు గత ఆరేళ్ళుగా జరుపుతున్న అధ్యయనంలో తాజాగా ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వెలుగు చూసిన కీలక అంశాలు..

జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన
“హయబుసా-2″ అని స్పేస్ ప్రోబ్ పలు అంశాల గుట్టు విప్పింది. ఇందులో భాగంగా 2020 సంవత్సరంలో Ryugu అనే గ్రహశకలం భూమ్మీదకు తీసుకొచ్చిన 5.4 గ్రాముల (0.2 ఔన్సుల) రాళ్ళు, ధూళిని సేకరించి పరిశీలించారు. వీటిలోని కొన్ని బ్లాకులలో అమైనో ఆమ్లాల ఉనికిని గుర్తించారు. అంతరిక్షంలోనే అవి ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.Ryugu గ్రహ శకలం శాంపిల్స్‌లో కనిపించిన ఆర్గానిక్‌ మెటీరియల్‌ వల్లే భూమ్మీద నీటి జాడ ఏర్పడి ఉండొచ్చని అంచనా వేసింది. అస్థిర, ఆర్గానిక్‌ మూలాలు అధికంగా ఉన్న సీ-టైప్ గ్రహశకలాలు.. భూమిపై ప్రస్తుతం ఉన్న నీటి యొక్క మూల వనరులలో ఒకటని సైంటిస్టులు విశ్లేషించారు.మొత్తం మీద సౌర వ్యవస్థ యొక్క బయటి అంచుల నుంచి ఆస్టరాయిడ్స్‌.. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయనేది జపాన్‌ స్పేస్‌ మిషన్‌ తేల్చింది.
ఈమేరకు ” జర్నల్‌ నేచర్‌ ఆఫ్‌ ఆస్ట్రోనమీ”లో అధ్యయన నివేదిక ప్రచురితం అయింది.