Everest Masala : ఎవరెస్ట్ ఫిష్ మసాలాకు భారీ షాక్‌

Everest Fish Curry Masala: భారత్‌(India)లో చాలా పాప్యులరిటి మసాలలో ఒకటైన ఎవరెస్ట్‌కు సింగపూర్‌లో షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేస్తున్న ఫిష్ మసాలాలో పురుగుల మందులు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. We’re now on WhatsApp. Click to Join. ఈ మేరకు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలను వెనక్కి తీసుకోవాలంటూ సింగపూర్ ఫఉడ్ ఎజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఓ ప్రకటన విడుదల […]

Published By: HashtagU Telugu Desk
MDH- Everest

A huge shock to Everest Fish Masala

Everest Fish Curry Masala: భారత్‌(India)లో చాలా పాప్యులరిటి మసాలలో ఒకటైన ఎవరెస్ట్‌కు సింగపూర్‌లో షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేస్తున్న ఫిష్ మసాలాలో పురుగుల మందులు ఉన్నట్లు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మేరకు భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలను వెనక్కి తీసుకోవాలంటూ సింగపూర్ ఫఉడ్ ఎజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశానికి దిగుమతి అయిన మసాలాల్లో ఇథిలిన్ ఆక్సైడ్ అనే పురుగు మందు అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయని అందువల్ల ఈ మసాలాను కొనుగోలు చేసిన వినియోగదారులు వినియోగించవద్దని సూచించింది. వెంటనే రీకాల్ చేయాలని ఆ దేశంలోఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే ఎస్పీ ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఎస్ఎఫ్ఏ ఆదేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

Read Also: AP Elections 2024: వైసీపీకి భారీ ఊరట.. చంద్రబాబు, షర్మిల, పవన్ కు కోర్టు ఆదేశాలు

ఇథిలీన్ ఆక్సైడ్ ను ఆహారంలో ఉపయోగించడానికి లేదని, వ్యవసాయంలో సూక్ష్మజీవుల నివారణకు ఉపయోగిస్తారని, ఇథిలిన్ ఆక్సైడ్‌ను ఆహార పదార్ధాల్లో ఉపయోగించడానికి సింగపూర్ ఫుడ్ రెగ్యులేషన్స్ అనుమతించదని ఎస్ఎఫ్ఏ పేర్కొంది. అయితే ఇథిలిన్ ఆక్సైడ్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ మేరకు ఎవరెస్ట్ ఫిష్ మసాలా రికాల్ విషయాన్ని పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

  Last Updated: 19 Apr 2024, 03:54 PM IST