Bin Less Country : చెత్తను సేకరించేందుకు డస్ట్ బిన్‌లను వాడుతుంటారు. పారిశుధ్య నిర్వహణలో కీలకమైన ప్రమాణంగా డస్ట బిన్‌లను పరిగణిస్తుంటారు. అయితే ఒక దేశంలో అస్సలు డస్ట్‌బిన్‌లు ఉండవు. ఎందుకు ? ఏమిటి? ఎలా ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Devansh Birthday: దేవాంశ్ బర్త్ డే.. తిరుమలలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు
టీ, కాఫీ షాపుల నుంచి మాల్స్ దాకా..
మన దేశంలోని బహిరంగ ప్రదేశాల్లో డస్ట్ బిన్‌లు కనిపిస్తాయి. ప్రజలు వాటిలో చెత్తను వేస్తుంటారు. కానీ ఒక దేశంలో డస్ట్ బిన్‌లు రోడ్డుపై ఎక్కడా కనిపించవు. ఎందుకంటే ఆ దేశ ప్రజలు తమ చెత్తను వారే జాగ్రత్తపర్చుకుంటారు. ఆ దేశంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో కూడా డస్ట్ బిన్స్ కనిపించవు. ఇక టీ, కాఫీ షాపుల్లో ప్రజలు తాగిన కప్పులను తిరిగి ఆ షాపుల్లోనే ఇచ్చేస్తారు. ఇంతకీ ఆ దేశం ఏది.. అనుకుంటున్నారా ? జపాన్.. !! జపాన్‌లో డస్ట్ బిన్‌లు ఎందుకు లేవో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
Also Read :Phone Connections: జనాభా కంటే ఫోన్ కనెక్షన్లే ఎక్కువే.. ‘ల్యాండ్‌లైన్’ పతనం
ఈ కారణం వల్లే..
జపాన్‌లో డస్ట్ బిన్‌లు(Bin Less Country) వినియోగించకపోవడానికి ప్రధాన కారణం.. 1995 మార్చి 20న జరిగిన ఒక ఘటన. ఆ రోజు జపాన్ రాజధాని టోక్యోలోని మెట్రో రైళ్లలో సారిన్ గ్యాస్ దాడి జరిగింది. ఓవర్గానికి చెందిన వారు ప్లాస్టిక్ సంచులలో విషపూరితమైన సారన్ గ్యాస్‌ను నింపి మెట్రో రైళ్లలో పెట్టారు. ఈఘటనలో రైలులోని 12 మంది చనిపోగా, వేలాది మంది గాయపడ్డారు. వారి ఆరోగ్యాలపై వివిధ రకాల దుష్ప్రభావాలు పడ్డాయి. ఈ ఘటన జపాన్‌కు పెద్ద చేదు జ్ఞాపకంగా మిగిలింది. భవిష్యత్తులో ఇలాంటి దాడి జరగొద్దని జపాన్ డిసైడ్ అయ్యింది. దేశంలో ఇక నుంచి డస్ట్ బిన్‌లను అస్సలు వాడొద్దని నిర్ణయించారు. అప్పటిదాకా వాడిన డస్ట్ బిన్‌లు అన్నింటినీ స్క్రాప్‌లో వేశారు. 1995 నుంచి కనీసం 30 ఏళ్లపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్తబుట్టలు వాడొద్దని జపాన్ తీర్మానించుకుంది. అయితే ఇప్పటికీ ఆ దేశంలో పలుచోట్ల చెత్త కుండీలు కనిపిస్తాయి. అయితే అవి సీల్ చేసి ఉంటాయి. చెత్తవేయడానికి చాలా చిన్న భాగం మాత్రమే తెరిచి ఉంటుంది. ఇంత పట్టుదల, క్రమశిక్షణ ఉన్నాయి కాబట్టే పరిశుభ్రత విషయంలో జపాన్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా అభివర్ణిస్తుంటారు. జపాన్‌లోని స్కూళ్లలో పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి ప్రత్యేకంగా నేర్పిస్తారు. 2022 ఖతార్ ప్రపంచ కప్ సందర్భంగా జపాన్ ఫుట్ బాల్ అభిమానులు జర్మనీపై విజయోత్సవాన్ని స్వయంగా స్టేడియంలను శుభ్రం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.