Site icon HashtagU Telugu

Indian women: ఆడ‌వాళ్ళు.. మీకు జోహార్లు!

Womens

Womens

ఒకవైపు కుటుంబ బాధ్యతలను, మరోవైపు ఆఫీస్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మహిళలు. పురుషులకు సైతం కష్టతరమైన పనులు చేయడానికి ఏమాత్రం వెనుకడటం లేదు. నింగి.. నేల అంటూ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అంతేకాదు.. ప్రమోషన్లు పొందడంలోనూ మహిళలే ముందుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పొలిస్తే, మన భారతీయులు ముందుంటున్నారు. భారతదేశంలోని మహిళలు ఉన్నత అవకాశాల కోసం చూస్తున్నారని, వివిధ పేరొందిన కంపెనీల్లో మరింత బాధ్యత వహించాలని కోరుకుంటున్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఓ అధ్యయనం వెల్లడించింది.

HP Inc చేసిన అధ్యయనం ప్రకారం.. US, UK దేశాల నుంచి 40 శాతం మహిళలు ప్రమోషన్లు సాధిస్తే, మనదేశంలో 92 శాతం మంది మహిళలు ప్రమోషన్ పొందారని స్పష్టం చేసింది. ఈ శాతం గతంలో 63 మాత్రమే ఉండేది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గత సంవత్సరం ప్రమోషన్‌లను పొందడంతో భారతీయ మహిళలు పురుషులను సైతం అధిగమించి ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. అధిక జీతం కోసం మాత్రమే కాకుండా, మరింత బాధ్యత గా పనిచేయడంతో పాటు కంపెనీని ప్రభావితం చేసే ఉన్నత పోస్టులను సమర్థవంతంగా నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నారు. 71 శాతం మంది భారతీయ మహిళలు గతంలో కంటే లింగ వివక్షను ఎదుర్కోవడంలోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారని సర్వే ఫలితాలు వెల్లడించాయి.

పెద్ద పెద్ద కంపెనీలు కూడా మహిళల పనితనాన్ని నమ్మి ఎంకరేజ్ చేస్తున్నట్టు సర్వే తేలింది. మనదేశంలో, Gen Z (41 శాతం) మిలీనియల్స్ (36 శాతం) మహిళలు కంపెనీ నిర్ణయాలకనుగుణంగా ముందుకు సాగుతున్నట్టు ఫలితాలు తెలియజేస్తున్నాయి. దేశంలో ఉద్యోగాలు చేసే ముగ్గురు మహిళల్లో ఒకరు కచ్చితంగా ఉన్నతమైన స్థానం కోరుకుంటున్నట్టు కూడా స్పష్టమైంది. అయితే భారతీయ మహిళలు ఒకవైపు వర్క్ ఒత్తిడిని అధిగమిస్తూనే, అందుకు తగ్గ సాలరీస్ కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారట. ఆకాశంలో సగమైన మహిళలు అవకాశాల్లోనూ టాప్ ప్లేస్ సాధించిన ఆశ్చర్యపోనకర్లేదు.

Exit mobile version