Hyderabad: సగం మంది మహిళలు స్థూలకాయులే!

హైదరాబాద్ సగం మంది మహిళలు అంటే దాదాపు 51శాతం మంది ఊబకాయంతో లేదా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారట.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 12:27 PM IST

హైదరాబాద్ సగం మంది మహిళలు అంటే దాదాపు 51శాతం మంది ఊబకాయంతో లేదా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వమే నేరుగా చెబుతోంది. తెలంగాణకు సంబంధించిన డేటాబేస్ ను బలోపేతం చేసేందుకు ప్రణాళిక శాఖ ఓ నివేదికను ప్రచురించింది. ఆ రిపోర్టును ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు రిలీజ్ చేశారు. ఇందులో హైదరాబాద్ మహిళల అధిక బరువును గుర్తించారు. కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ 2019-20కి రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం ఒక్కో మహిళ బాడీ మాస్ ఇండెక్స్ లో ఉండాల్సిన బరువు కన్నాఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 51శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణ మొత్తంగా ఈ సమస్య కేవలం 30.1శాతం మాత్రమే. అంటే కేవలం హైదరాబాద్ లో ఉంటున్న మహిళలు మాత్రమే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

కుమురంభీం జిల్లాలో 14శాతం మంది మహిళలు మాత్రమే అధిక బరువుతో బాధపడుతున్నారని తేలింది. బీఎంఐలో అధిక బరువు (BMI ≥ 25.0 kg/m2) తెలంగాణ మొత్తంగా 30.1శాతం ఉంది. తెలంగాణలో18.8శాతం మంది మహిళలు వారి బీఎమ్ఐ లెవల్స్ ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే 51శాతం మందికి ఎక్కువగా 18.8శాతం మందికి తక్కువగా ఉన్నాయి. మిగిలిన వారికి మాత్రం ఆరోగ్యపరంగా ఎంత బీఎంఐ లెవల్స్ ఉండాలో అంతే ఉన్నాయట.

కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ రిపోర్టులో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ మహిళలు..తెలంగాణ మొత్తం సగటుతో పోల్చితే..ఎంతో విద్యాధికులు. హైదరాబాద్ లో ఉన్న మహిళలో 83.6 శాతం మంది అక్షరాస్యత కలినవారున్నారు. తెలంగాణ మొత్తం ఈ శాతం 66.6శాతం మాత్రమే ఉంది. తెలంగానలో నమోదవుతున్న జననాల్లో 60శాతం సిజేరియన్లే. కరీంనగర్ లో అయితే ఏకంగా 83శాతం జననాలు సిజెరియన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రభుత్వం నార్మల్ డెలివరీకి ప్రోత్సహిస్తున్నప్పటికీ..ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ వైపే మొగ్గు చూపడంతో..పెద్దగా ఫలితం ఉండటం లేదట.