5 Big Changes : త్వరలో ‘హెచ్-1బీ వీసా’ మార్పులు.. ఇండియన్స్‌పై బిగ్ ఎఫెక్ట్

5 Big Changes : ‘హెచ్‌–1బీ’.. ఇది ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే కీలకమైన వీసా ప్రోగ్రాం. 

Published By: HashtagU Telugu Desk
5 Big Changes

5 Big Changes

5 Big Changes : ‘హెచ్‌–1బీ’.. ఇది ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే కీలకమైన వీసా ప్రోగ్రాం.  అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసా జారీ ప్రక్రియలో పలు మార్పులను ప్రతిపాదించింది. త్వరలో ప్రభుత్వం వీటిన ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజల ముందుకు తీసుకురానుంది. అయితే రాబోయే మార్పులు ఏమిటనే దానిపై అమెరికా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. దరఖాస్తుదారులకు సమన్యాయం జరిగేలా, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ప్రతిపాదనలు ఉంటాయని వెల్లడించింది. ఉపాధిని పొందే వారిలో నకిలీలకు అవకాశం లేకుండా చూసేందుకు ఇవన్నీ చేయక తప్పదని అమెరికా వాదిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పులతో ముడిపడిన కీలక వివరాలను (5 Big Changes) ఒకసారి చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

భారతీయులపై ఈ ఎఫెక్ట్స్ 

‘హెచ్‌–1బీ’ వీసాల జారీ ప్రక్రియకు సంబంధించి  ప్రతిపాదించిన మార్పుల ప్రభావం భారతీయులపై పడే అవకాశం కనిపిస్తోంది. వీటి పర్యవసానంగా భారతీయులు మరిన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి రావచ్చు. వారు పనిచేసే ప్రాంతాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తారు. ఉద్యోగి తరఫున అప్లికేషన్  పంపిన కంపెనీకి హెచ్-1బీ వీసా ఉద్యోగుల అవసరం నిజంగానే ఉందా లేక వ్యవస్థను దుర్వినియోగ పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయా అని తెలుసుకునేందుకు అధికారులు స్వయంగా కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తారు. హెచ్-1బీ వీసా ద్వారా ఆయా సంస్థలు మూడు నుంచి ఆరేళ్లపాటు విదేశీ కార్మికులను, ఉద్యోగులను అమెరికాలో నియమించుకోవచ్చు. అయితే, హెచ్‌-1బీ వీసా ఉన్నవారు గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నిస్తూ తరచుగా తమ వర్క్‌ వీసాలను రెన్యువల్‌ చేయించుకుంటున్నారు.

‘హెచ్‌–1బీ’ వీసాల జారీలో ప్రతిపాదిత మార్పులివీ.. 

  • విదేశీ కార్మికులు, ఎఫ్‌-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను క్రమబద్ధీకరించడంతో పాటు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని ప్రతిపాదించారు.
  • లాభాపేక్ష లేని సంస్థలను నిర్వహించే పారిశ్రామికవేత్తలకు మెరుగైన పని వసతులను కల్పించే అవకాశం ఉంది.
  • నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వర్కర్స్‌కు కూడా ఈ వీసా ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.
  • ప్రస్తుత హెచ్-1బీ వీసా ప్రక్రియలో ఒక దరఖాస్తుదారు తరఫున ఎన్ని ఎక్కువ రిజిస్ట్రేషన్లు నమోదైతే అంతమేర లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి. కానీ కొత్తగా ప్రతిపాదించిన విధానంలో ఒకరి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదైనా ఎంపిక ప్రక్రియలో ఒక ఎంట్రీగానే పరిగణిస్తారు. తద్వారా కొందరికే ఎక్కువ అడ్వాంటేజీకి బదులు అర్హులందరికీ సమాన అవకాశం దక్కుతుందని అమెరికా అంటోంది.
  • అమెరికా ఏటా విడుదల చేసే 60వేల హెచ్‌–1బీ వీసాల కోటాలో మార్పు ఉండదు.

Also Read: Israel – Obama : ఇజ్రాయెల్‌కు ఒబామా వార్నింగ్.. ఏమన్నారంటే ?

  Last Updated: 24 Oct 2023, 08:33 AM IST