Site icon HashtagU Telugu

IRDAI లో 45 అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. లాస్ట్ డేట్ మే 10

45 Assistant Manager Jobs In Irda.. Last Date May 10

45 Assistant Manager Jobs In Irda.. Last Date May 10

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) 45 అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది.  అభ్యర్థులు రూ.750 ఫీజుతో మే 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. బీమా రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈపోస్టులలో 20 అన్‌ రిజర్వ్‌డ్‌గా ఉండగా, 12 ఓబీసీకి, 6 ఎస్సీ, 3 ఎస్టీ, 4 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. ప్రకటించిన మొత్తం ఖాళీలలో 5 పోస్టులు చొప్పున యాక్చురియల్, ఫైనాన్స్, లా, IT మరియు రీసెర్చ్ స్ట్రీమ్‌ విభాగాలకు కేటాయించ బడ్డాయి.ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (irdai.gov.in) నుంచి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు సమయంలో రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుముగా రూ. 750 ఉంటుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

IRDAI లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వివిధ స్ట్రీమ్ పోస్టుల కోసం, అభ్యర్థులు సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్/పీజీ (పోస్టుల ప్రకారం వేర్వేరుగా) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, అభ్యర్థుల వయస్సు 10 మే నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ మరియు 30 సంవత్సరాలకు మించకూడదు.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

Also Read:  EPFO, UPSC సహా పలు కీలక విభాగాల జాబ్ నోటిఫికేషన్స్.. పూర్తి వివరాలివీ..