MIG 21: 60 ఏళ్లలో 200 మందిని మింగేసిన “మిగ్-21″… కొనసాగింపుపై అభ్యంతరాలు!!

రష్యా నుంచి భారత్ కొన్న మిగ్‌-21 యుద్ధ విమానాలు మృత్యు శకటాలుగా మారాయి. తాజాగా గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ యుద్ధవిమానం రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో కుప్పకూలింది.

  • Written By:
  • Publish Date - July 31, 2022 / 10:00 AM IST

రష్యా నుంచి భారత్ కొన్న మిగ్‌-21 యుద్ధ విమానాలు మృత్యు శకటాలుగా మారాయి. తాజాగా గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ యుద్ధవిమానం రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈవిధంగా మిగ్‌-21 యుద్ధ విమానాలు కూలడం తొలిసారేం కాదు. వాటిని సైన్యంలోకి ప్రవేశపెట్టినప్పటి  60 ఏళ్లు అవుతోంది. ఈ 60 ఏళ్లలో దాదాపు 400 ప్రమాదాలు జరిగాయంటే వాటి ఫెయిల్యూర్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో మిగ్-21 ఫైటర్ జెట్లను పక్కన పెట్టాలనే వాదన తెరపైకి వస్తోంది.మిగ్‌-21 ప్రమాదాలు పెరగడంతో…తేజాస్ ఫైటర్‌పై వాయుసేన దృష్టి సారించింది. భారత వైమానిక దళం… సెప్టెంబర్ చివరి నాటికి మిగ్‌-21 విమానాల సేవలను నిలిపివేయాలని భావిస్తోంది.

మృత్యువాత పడ్డది ఎందరో..

మిగ్‌-21 మోడల్‌లో బైసన్ సిరీస్‌ సరికొత్త వేరియంట్. దీన్ని సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేసినప్పటికీ.. తరచూ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. గత 60 ఏళ్లలో ఏకంగా 400 మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఈ ప్రమాదాల్లో 200 మంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. 60 మంది సాధారణ పౌరులు…ఈ ప్రమాదాలకు బలి కావాల్సి వచ్చింది. .

రష్యా ఉత్పత్తి ఆపేసినా.. ఇండియా వాడుతోంది

1963 సంవత్సరంలో రష్యా నుంచి మిగ్ యుద్ధ విమానాల కొనుగోలును భారత్ ప్రారంభించింది. 1967లో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్ వచ్చింది. అనంతరం విమానాల ఉత్పత్తిని “హాల్” ప్రారంభించింది. రష్యా 1985లో మిగ్ విమానాల తయారీని నిలిపివేసింది. కానీ భారత వాయుసేన మాత్రం సెన్సార్లు, వెపన్స్‌… అప్‌గ్రేడ్ చేసి దాన్ని ఉపయోగిస్తోంది.భారత వైమానిక దళానికి 42 స్వ్కాడ్రన్లు ఉండాలి. ప్రస్తుతం 32 స్వ్కాడ్రన్లే ఉన్నాయి. ఇందులో మిగ్‌-21 బైసన్‌కు నాలుగు స్క్వాడ్రన్లు ఉన్నాయి

అభినందన్‌ వర్దమాన్‌ ఘటన గుర్తుందా?

2019లో వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌ కూడా… మిగ్‌-21 విమానం ప్రమాదంలోనే పాకిస్తాన్‌ భూభాగంలో పడిపోయాడు. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌-16 ఫైటర్‌ను కూల్చేసిన తర్వాత.. అభినందన్‌ విమానం కూలిపోయింది. ఆ తర్వాతే భారత సైన్యం బాలాకోట్‌పై దాడులకు పాల్పడింది.