Site icon HashtagU Telugu

Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్.. నీ స్థానాన్ని నువ్వే సంపాదించుకోవాలి : షేన్ బాండ్

Arjun Tendulkar

Arjun Tendulkar

క్రికెట్ దేవుడు “సచిన్” కుమారుడు అంటే మామూలు విషయమా!! సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఐపీఎల్ వేలంలో అర్జున్ ను ముంబై ఇండియన్స్ టీమ్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా అర్జున్ కు దక్కలేదు. అతడు డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని మ్యాచ్ లు చూశాడు. ఈనేపథ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” టీమ్ స్క్వాడ్ లో చోటు సంపాదించడం ఒక ఎత్తయితే..టీమ్ 11 లో ఒకరిగా నిలవడం మరో ఎత్తు. జట్టులో అవకాశాన్ని సంపాదించేందుకు అర్జున్ మరింత కష్టపడాలి.

బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయాల్లో అతడు మరింత అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది” అని షేన్ బాండ్ పేర్కొన్నారు. ” స్క్వాడ్ లోని ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలనే అంశం జట్టు పరిధిలో ఉంటుంది. జట్టులో చోటు సంపాదించేందుకు శాయశక్తులా కృషి చేయడం అనేది ప్లేయర్ చేతుల్లో ఉంటుంది” అని షేన్ బాండ్ అభిప్రాయపడ్డారు.కాగా, దేశవాళీ టీ20 టోర్నీల్లో ఇప్పటివరకు అర్జున్ టెండూల్కర్ రెండే మ్యాచ్ లు ఆడారు. ఆయన లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్, బ్యాటింగ్ చేయగలరు.