World Green City Award 2022: అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన హైదరాబాద్…భాగ్యనగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు..!!

తెలంగాణ ఖ్యాతి మరోసారి ప్రపంచం వ్యాప్తంగా మారుమ్రోగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది.

Published By: HashtagU Telugu Desk
Hyd

Hyd

తెలంగాణ ఖ్యాతి మరోసారి ప్రపంచం వ్యాప్తంగా మారుమ్రోగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటింది. AIPH అందజేసే వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022ను గెలుచుకుంది. దక్షిణకొరియాలోని జేజులో శుక్రవారం జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ 2022లో లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ కేటగిరీలో హైదరాబాద్ ఈ అవార్డు వచ్చింది.

ఏఐపీహెచ్ ఆరు కేటగిరీల్లో ఈ అవార్డు కోసం ఎంట్రీలను ఆహ్వానించింది. ఆరు కేటగిరిల్లో మొత్తం 18 మందిని తుది జాబితాగా ఎంపికు చేశారు. తుది జాబితాల వారీగా శుక్రవారం విజేతలను ప్రకటించారు. అందులో హైదరాబాద్ వరల్డ్ గ్రీన్ సిటి అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ నగరం హైదరాబాద్. కేటగిరి అవార్డు మాత్రమే కాదు..ఆరు కేటగిరిల్లోనూ అత్యత్తమైన వరల్డ్ గ్రీన్ సిటీ 2022 అవార్డును గెలుచుకోవడం గర్వకారణం అని రాష్ట్ర సర్కార్ తెలిపింది. ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్’ కేటగిరీలో ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనాన్ని హైదరాబాద్ ఎంట్రీగా సమర్పించారు. ‘తెలంగాణ రాష్ట్రానికి హరిత నెక్లెస్’ అని పిలువబడే ఓఆర్ ఆర్ పచ్చదనం ఈ కేటగిరీలో ఎంపిక చేశారు. ఈ ఘనత సాధించినందుకు HMDA బృందాన్ని,MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు.

  Last Updated: 15 Oct 2022, 04:44 AM IST