Site icon HashtagU Telugu

CM Stalin: తెలుగు నేతలకు ‘నో’ ఇన్విటేషన్..!

Stalin

Stalin

త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆటోబ‌యోగ్రఫీ ఒంగ‌ళిల్ ఒరువ‌న్  (మీలో ఒక‌డిని) పుస్తకం ఆవిష్కర‌ణ ప్రతిప‌క్షాల ఐక్యత‌కు వేదిక‌గా మారింది. దేశంలో పొలిట‌క‌ల్ ప్రంట్స్ ఎలా ఉంటాయో ఇదొక హింట్ ఇచ్చింది. కానీ ఇందులో మరో విశేషం ఉంది. తెలుగు రాష్ట్రాలు నుంచి చంద్రబాబు, కేసిఆర్, జగన్ కు ఆహ్వానం అందలేదు. విప‌క్షాల ఐక్యతలో ఇది కొత్త పేజీలు రాసేదిగా ఉంది. కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. జ‌మ్ము-కాశ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా,  కేర‌ళ సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్‌,  rjd నాయ‌కుడు తేజ‌స్వీ యాద‌వ్  పాల్గొన్నారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెనర్జీకి ఇన్విటేష‌న్ అందినా రాలేక‌పోయారు.

రాష్ట్రాల హ‌క్కుల సాధ‌నే ఈ స‌మావేశం మెయిన్ థీంగా మారింది.  మోదీ ప్ర‌భుత్వం రాష్ట్రాల అధికారాల‌ను లాగేసుకుంటోంద‌ని  కీల‌క ప్రసంగం చేసిన రాహుల్ విమ‌ర్శించారు. మోదీకి దేశంలోని వివిధ ప్రాంతాల చ‌రిత్ర తెలియ‌ద‌ని, అందుకే ఇష్టం వ‌చ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని ఆరోపించారు. ప‌రిపాల‌న అంతా గుజ‌రాత్‌, యూపీ కేడ‌ర్ అధికారుల‌కే ప‌రిమిత‌మ‌యిందంటూ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చేశారు.  ప్రతిప‌క్షాల యూనిటీ, మోదీ ప్రభుత్వంపై యుద్దానికి  ఈ పాయింట్లే బేస్‌గా  ఉండ‌నున్నాయి. రాష్ట్రాల స్వయం పాల‌న కోసం పోరాటం పేరుతో రీజ‌న‌ల్ పార్టీల‌ను క‌లుపుకొని పోయే అవ‌కాశం ఉంది. ఈ స‌మావేశానికి తెలుగు రాష్ట్రాల నాయ‌కుల‌కు ఇన్విటేషన్ అంద‌లేదు.  తెలంగాణ సీఎం కేసీఆర్ bjpతో ఎప్పడు ఏ స్టాండ్ తీసుకుంటారో తెలియ‌ద‌ని,  అందుకే పిలవ‌లేద‌ని త‌మిళ‌నాడు రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. కేసుల కార‌ణంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌ను కూడా ఆహ్వానించ‌లేద‌ని అంటున్నాయి. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప‌రిమిత‌మయి, జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిపెట్టక‌పోవ‌డం వ‌ల్ల కూడా ఆయ‌న‌ను ఇన్‌వైట్ చేయ‌లేద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

Exit mobile version