Puneeth Rajkumar:ఆయన్ని పవర్ స్టార్ అనడానికి రీజన్ ఇదే

కన్నడ సినీ ఇండస్ట్రీలో ఒకవెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. తనని తన అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తారని, అయితే తన అభిమానులే తన పవర్ అని పునీత్ చెప్పేవారు.

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 11:54 AM IST

కన్నడ సినీ ఇండస్ట్రీలో ఒకవెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. తనని తన అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తారని, అయితే తన అభిమానులే తన పవర్ అని పునీత్ చెప్పేవారు.

వేరేభాషల్లో డిసాస్టర్ మూవీస్ ను పునీత్ రీమేక్ చేసి మరి హిట్ కొట్టాడు ఇదే మనోడికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.

పునీత్ రాజ్ కుమార్ అసలు పేరు లోహితాస్య. 1975 మార్చి 17న లోహిత్ రాజ్ కుమార్ మద్రాసులో జన్మించారు. రాజ్ కుమార్ ఐదుగురు సంతానంలో లోహిత్ అందరికంటే చిన్నవాడు. అతను పుట్టిన తరువాతే రాజ్ కుమార్ కన్నడనాట చిత్రపరిశ్రమ అభివృద్ధికై తన నివాసాన్ని బెంగళూరుకు మార్చారు. ఆ తరువాతే ఇతర కన్నడ తారలు కర్ణాటక రాజధాని చేరుకున్నారు. లోహిత్ ఐదేళ్ళ వయసులోనే తండ్రి నటించిన ‘వసంతగీత’ చిత్రంలో బాలనటునిగా నటించి మెప్పించారు. ఆ తరువాత తండ్రి హీరోగా రూపొందిన “భాగ్యవంత, చెలుసువే మోడగల్, ఎరడు నక్షత్రగలు, భక్త ప్రహ్లాద, యారివను, బెట్టద హూవు” వంటి చిత్రాలలో బాలనటునిగా నటించి ఆకట్టుకున్నారు. ‘భాగ్యవంత’ చిత్రంలో ప్రధాన కథ లోహిత్ చుట్టూ తిరుగుతుంది.
పునీత్ నటించిన ‘బెట్టద హూవు’ సినిమా ద్వారా ఉత్తమ బాలనటునిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.

 

లోహిత్ పేరు పునీత్ రాజ్ కుమార్ గా మారిన తర్వాత తొలిచిత్రం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అప్పు సినిమాతోనే స్టార్ట్ అయింది. దీన్ని తర్వాత తెలుగులో ఇడియట్ సినిమాగా తీసారు.
తెలుగులో జూనియర్ యన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఆంధ్రావాలా సినిమా తెలుగులో ప్లాప్ అవ్వగా దాన్ని రీమేక్ చేసి కన్నడలో సూపర్ హిట్ కొట్టాడు.

తెలుగులో విజయం సాధించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ని కన్నడలోలో మౌర్య గా,
రెఢీ సినిమాను రామ్ గా,
తీసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

 

పునీత్48 సినిమాల్లో నటించగా వాటిల్లో 40 సినిమాలు థియేటర్లో వంద రోజులు ఆదాయంటే ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. పునీత్ తన సినిమాలకి తానే పాటలు పాడుకునేవార. పునీత్ పాడిన పాటల్లో ఒకదానికి ఉత్తమ గాయకునిగా నేషనల్ అవార్డ్ లభించింది. కన్నడ చిత్రసీమలో అత్యధిక పారితోషికం పుచ్చుకొనే అతి కొద్ది మందిలో పునీత్ రాజ్ కుమార్ ఒకరు.

ఆయన బుల్లితెరపైనా తనదైన బాణీ పలికించారు. మన దగ్గర ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం లాంటి కన్నడద కోట్యాధిపతి కార్యక్రమానికి పునీత్ ప్రెజెంటర్ గా ఆకట్టుకున్నారు.

నందినీ మిల్క్, 7 అప్, మలబార్ గోల్డ్, పోతీ సిల్క్స్, ఫ్లిప్ కార్ట్, మనప్పురమ్ సంస్థలకు పునీత్ బ్రాండ్ అంబాసిడర్. కన్నడసీమకు చెందిన ఐపీఎల్ టీమ్ ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’కు కూడా పునీత్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే పునీత్ కు సొంతగా ‘బెంగళూరు 5’ అనే ప్రీమియర్ ఫ్యూట్సల్ టీమ్ కూడా ఉంది. యూ ట్యూబ్ లో ‘పీఆర్కే ఆడియో’ కూడా పునీత్ కు చెందినదే.

పునీత్ చనిపోయాక తాను చేసిన మంచి పనులు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి.

తాను దత్తత తీసుకున్న పాఠశాలలు, అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పునీత్ మరణంతో అనాధలయ్యాయి.