Winter : తెలంగాణ‌లో శీతాకాలం లేన‌ట్టే!

ఈ ఏడాది తెలంగాణ శీతాకాలానికి దూరం అయిన‌ట్టు క‌నిపిస్తోంది. సాధారణంగా న‌వంబ‌ర్ చివ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావాలి. చ‌లి గాలులు తీవ్రంగా వీయాలి. త‌ద్భిన్న‌మైన ప‌రిస్థితి తెలంగాణ వ్యాప్తంగా క‌నిపిస్తోంది. మ‌రో ప‌ది రోజులు త‌రువాత చ‌లి ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది.

  • Written By:
  • Publish Date - December 10, 2021 / 03:36 PM IST

ఈ ఏడాది తెలంగాణ శీతాకాలానికి దూరం అయిన‌ట్టు క‌నిపిస్తోంది. సాధారణంగా న‌వంబ‌ర్ చివ‌రి నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావాలి. చ‌లి గాలులు తీవ్రంగా వీయాలి. త‌ద్భిన్న‌మైన ప‌రిస్థితి తెలంగాణ వ్యాప్తంగా క‌నిపిస్తోంది. మ‌రో ప‌ది రోజులు త‌రువాత చ‌లి ఉండే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తోంది.
తెలంగాణలో సాధారణంగా నవంబర్ చివరి వారంలో చలికాలం ప్రారంభమవుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలో 5 నుండి 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. డిసెంబర్ చివరి వారం నాటికి మరింత తగ్గుతాయి. శీతాకాలం సాధారణంగా జనవరి రెండవ వారంలో గరిష్ట స్థాయికి తెలంగాణ వ్యాప్తంగా చేరుకుంటుంది.
ఈ ఏడాది చ‌లికాలం ఉష్ణోగ్ర‌త‌లు తెలంగాణ వ్యాప్తంగా పెరిన‌ట్టు హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఇండియా వాతావరణ విభాగం (IMD) గుర్తించింది. డిసెంబర్ 8న హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, గత ఏడాది ఇదే రోజున 15.5 డిగ్రీల సెల్సియస్ న‌మోదు అయింది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌లో గత ఏడాది ఇదే రోజున 10 డిగ్రీల సెల్సియస్‌తో పోలిస్తే ఈ ఏడాది అదే రోజున 19 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
గత 30 ఏళ్లుగా సేకరించిన డేటా ప్రకారం డిసెంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతూ చివ‌రి రెండు రోజులు (సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ) కనిష్ట ఉష్ణోగ్రతలు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది ఎలాంటి చ‌లి కాలం క‌నిపించ‌లేదు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఒకటి లేదా రెండు సార్లు చలిగాలులు వీచే అవ‌కాశం ఉంది. శీతాకాలం ఆలస్యం కావడానికి కారణం ఈ ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల వంటి పరిస్థితులు తీవ్రంగా కొనసాగడం. ఇప్పటికీ తక్కువ స్థాయి తూర్పు ఈశాన్య గాలులు ఉండ‌డం. తుఫాను వ్యతిరేక ప్రసరణ ఇప్పటికీ మధ్య భారతదేశంపై ఉండ‌డం, ఉత్తర , వాయువ్య పొడి , చల్లని గాలులు త‌దిత‌రాలు ఉన్నాయి.
డిసెంబ‌ర్ 15 త‌రువాత అక‌స్మాత్తుగా ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయే అవ‌కాశం ఉంది.
పసిఫిక్ మహాసముద్రం, బంగాళాఖాతంలో బహుళ అల్పపీడనాలు ఏర్పడి ఇటీవల తూర్పు తీరంలో తీవ్ర వర్షపాతం నమోదు కావ‌డం తెలంగాణ శీతాకాలంపై ప్ర‌భావం ప‌డింది. “సాధారణంగా ఉత్తర భారతదేశం నుండి పొడి గాలులు వీచినప్పుడు తెలంగాణపై వాతావరణం తగ్గుతుంది. కానీ, ఈ సారి వాతావ‌ర‌ణ మార్పులు అనూహ్యంగా ఉండ‌డంతో