Site icon HashtagU Telugu

Sky Force Vs Kodava Community : ‘స్కై ఫోర్స్’‌‌ మూవీపై కొడవ వర్గం భగ్గు.. కారణం ఇదీ

Sky Force Vs Kodava Community Akshay Kumar Karnataka

Sky Force Vs Kodava Community :  ‘స్కై ఫోర్స్’ సినిమా జనవరి 24న విడుదలైంది. దీనిలో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. 1965లో భారత్-పాక్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్‌లోని సర్గోఢా వైమానిక స్థావరంపై భారత వాయుసేన గగనతల దాడులు చేసింది. ఈ దాడులతో ముడిపడిన వివరాలతో ‘స్కై ఫోర్స్’ సినిమాను తీశారు. అయితే ఈ మూవీని కర్ణాటకలోని కొడవ వర్గం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ‘స్కై ఫోర్స్’ సినిమాకు వ్యతిరేకంగా కొడవ వర్గానికి చెందిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.

Also Read :Bill Gates Regret : మెలిండాకు విడాకులపై బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు

కొడవ వర్గం ఎందుకు వ్యతిరేకిస్తోంది ?

‘స్కై ఫోర్స్’ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ అజ్జమద బోపయ్య దేవయ్య(Sky Force Vs Kodava Community )పాత్ర ఉంది. మహావీర చక్ర లాంటి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఈ వీరుడు కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్‌లో 1932 సంవత్సరం డిసెంబరు 24న జన్మించారు. ఈయన తండ్రి పేరు డాక్టర్ బోపయ్య.  అయితే ఈ సినిమాలో బోపయ్య దేవయ్య తమిళుడు అన్నట్టుగా చూపించారు. ఇదే విషయం కర్ణాటకలోని కొడవ వర్గానికి కోపాన్ని తెప్పించింది. భారతదేశం కోసం పాకిస్తాన్ గడ్డపై అమరుడైన ఒక యోధుడి గురించి ఈవిధంగా తప్పుడు సమాచారాన్ని సినిమాలో చూపించకూడదని వారు వాదిస్తున్నారు. బోపయ్య దేవయ్య కర్ణాటక వాస్తవ్యుడు అన్నట్టుగా సినిమాలో చూపిస్తే బాగుండేదని కొడవ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. చరిత్రను వక్రీకరించేలా సినిమాలు ఉండకూడదని వారు చెబుతున్నారు.  ‘స్కై ఫోర్స్’ మూవీలో వింగ్ కమాండర్ ఓం ప్రకాశ్ తనేజా పాత్రను అక్షయ్ కుమార్ పోషించారు.  స్క్వాడ్రన్ లీడర్ అజ్జమద బోపయ్య దేవయ్య పాత్రను వీర్ పహారియా పోషించారు.

Also Read :Google Doodle : రిపబ్లిక్ డే వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్.. జంతుజాలంతో పరేడ్

భారత్-పాక్ యుద్ధం.. అజ్జమద బోపయ్య దేవయ్య ఏం చేశారంటే..

1965లో భారత్-పాక్ యుద్ధ జరిగింది. దీంతో పాకిస్తాన్‌లోని సర్గోఢా వైమానిక స్థావరంపై గగనతల దాడులు చేసిన భారత వాయుసేన టీమ్‌లో స్క్వాడ్రన్ లీడర్ అజ్జమద బోపయ్య దేవయ్య కూడా ఉన్నారు. ఆ సమయంలో భారత వాయుసేనకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని పాక్ యుద్ధ విమానం ఒకటి వెంటాడింది. ఈక్రమంలో మార్గం మధ్యలోనే దాన్ని అజ్జమద బోపయ్య దేవయ్య పేల్చేశారు.  ఈ ఘటనలో ఆయన ఉన్న భారత వాయుసేన యుద్ధ  విమానం కూడా దెబ్బతిని పాకిస్తా‌న్ భూభాగంలోనే కూలిపోయింది. బోపయ్య దేవయ్య అక్కడే తుదిశ్వాస విడిచారు. భారతావని కోసం అమరులయ్యారు. ఈ ఘటన జరిగిన 23 ఏళ్ల తర్వాత 1988లో ఆయనకు భారత ప్రభుత్వం మహా వీర చక్రను ప్రకటించింది.