మాల్గుడి కథలు ఎక్కడ తీశారు? 80ల నాటి టెలివిజన్ స్టోరీలో తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలు

80లలో బాగా పాప్యులర్ అయిన టీవీ సీరియల్ మాల్గుడి కథలు. అప్పట్లో జనాలను టీవీల ముందు కట్టిపడేసిన టీవీ షోలలో ఇదీ ఒకటి. ఆర్.కె.నారాయణ్ రచించిన మాల్గుడి డేస్ ఆధారంగా దీన్ని చిత్రీకరించారు. చరిత్ర గురించి ఏ కాస్త తెలుసుకున్నా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇందులో భాగంగానే మాల్గుడి కథలు సీరియల్‌ను ఎక్కడ షూట్ చేశారో తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:46 AM IST

80లలో బాగా పాప్యులర్ అయిన టీవీ సీరియల్ మాల్గుడి కథలు. అప్పట్లో జనాలను టీవీల ముందు కట్టిపడేసిన టీవీ షోలలో ఇదీ ఒకటి. ఆర్.కె.నారాయణ్ రచించిన మాల్గుడి డేస్ ఆధారంగా దీన్ని చిత్రీకరించారు. చరిత్ర గురించి ఏ కాస్త తెలుసుకున్నా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇందులో భాగంగానే మాల్గుడి కథలు సీరియల్‌ను ఎక్కడ షూట్ చేశారో తెలుసుకుందాం.

భారతదేశ చరిత్రలోనే అత్యంత పాప్యులర్ అయిన టీవీ సీరియళ్లలో మాల్గుడి డేస్ ఒకటి. మాల్గుడి డేస్ పేరుతో ఆర్.కె.నారాయణ్ రచించిన పుస్తకం ఆధారంగా దీన్ని తీశారు. అదే బుక్ టైటిల్‌ను సీరియల్‌కు పెట్టారు. ఈ సీరియల్ మొత్తం పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. పైగా ఒకప్పటి భారతదేశం, ప్రదేశాలు, ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఈ సీరియల్ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.

మాల్గుడి డేస్ ఎక్కడ చిత్రీకరించారు?

ఆగుంబే గ్రామం. కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లాలో ఉన్న ఈ గ్రామంలోనే మాల్గుడి కథలు సీరియల్‌ను షూట్ చేశారు. ఇందులో ఉండే వివిధ ఎపిసోడ్లు వివిధ రకాల కథలను చెబుతుంది. కాని, ఏ ఎపిసోడ్‌లో ఏ కథ చెప్పినప్పటికీ.. చివరాఖరున అందులో ఏదో ఒక నీతి కనిపిస్తుంది. చూసే ప్రేక్షకులకు నీతిని బోధిస్తున్నట్టుగా ఉంటుంది. కాని, ఈ సీరియల్‌లో కనిపించిన దృశ్యాలు, పల్లెటూరి వాతావరణం, ఒకప్పటి భారతీయ గ్రామీణ వ్యవస్థను మాత్రం ఎక్కడా మార్చలేదు. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు అదే టెంపో మెయిన్‌టైన్ చేశారు. ఈ సీరియల్ ఎంత ఫేమ్ తీసుకొచ్చిందంటే.. ఆ తరువాత వచ్చిన సినిమాలు, సీరియళ్లకు కర్నాటక ఓ కేరాఫ్‌గా మారింది. ఇదే కర్నాటకలోని పలు ప్రాంతాల్లో టీవీ సీరియళ్లు, సినిమాల చిత్రీకరణ జరిగింది.

బెంగళూరు నగరం కూడా మరో ముఖ్యమైన షూటింగ్ ప్రాంతం. కర్నాటక రాజధాని అయిన బెంగళూరులో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు, సీరియళ్లు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కేవలం కన్నడ చిత్రాలే కాదు.. ప్రాంతీయ సినిమాలు, బాలీవుడ్ సినిమాలు సైతం ఇక్కడ చిత్రీకరణ జరుపుకుంటున్నవే. ఉదాహరణకు ఒకప్పుడు దేశాన్నే ఊపేసిన షోలే, త్రీ ఇడియట్స్, ఏ పాసేజ్ టు ఇండియా, బిగ్ బ్రదర్, గజిని, మే తేరా హీరో లాంటి సినిమాలన్నీ బెంగళూరులో షూటింగ్ చేసుకున్నవే.

 

ఇక మాల్గుడి డేస్ విషయానికొస్తే… మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ఆగుంబేలోనే జరిగింది. ఈ స్టోరీ టైటిల్, లైన్ మొత్తం ఆర్.కె.నారాయణ్ నవల నుంచి తీసుకున్నప్పటికీ.. ఇందులోని కొన్ని ఎపిసోడ్లలో ఆర్కే రాసిన ఏ హార్స్ అండ్ టూ గోట్స్ నవలలోని కథలను కూడా తీసుకున్నారు. దీంతో పాటు ఏన్ ఆస్ట్రాలజర్స్ డే, ఇతర నవలలోని కథాంశాలను సైతం మాల్గుడి డేస్ సీరియల్‌లో ఉపయోగించారు.

మాల్గుడి డేస్ టీవీ సీరియల్‌కు శంకర్ నాగ్, కవిత లంకేశ్ దర్శకత్వం వహించారు. 1986లో మొదలైన ఈ టీవీ సీరియల్ నాలుగు సీజన్లుగా వచ్చింది. 1988 వరకు మూడు సీజన్లుగా మాల్గుడి డేస్ ప్రసారం అయింద. ఆ తరువాత 2006లో వచ్చిన నాలుగో సీజన్‌లో 15 ఎపిసోడ్స్ ను టెలికాస్ట్ చేశారు. ఇక ఈ సీరియల్‌లో నటించిన నటీనటులకు బోలెడంత పాప్యులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఈ సీరియల్‌లో ముఖ్యపాత్ర పోషించిన మాస్టర్ మంజునాథ్.. తెలుగులో వచ్చిన స్వాతికిరణం సినిమాలోనూ కనిపించాడు. గిరీశ్ కర్నాడ్, వైశాలి కాసరవల్లి లాంటి ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఈ సీరియల్‌లో నటించారు.