Hawaii: వామ్మో.. చావు అంచుకు తీసుకెళ్లిన విమానం… రెప్పపాటులో ఎగిరి!?

రోడ్డు ప్రమాదాలు రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. ఏ న్యూస్‌ పేపర్‌ చూసినా.. నేరాలు-ఘోరాలకు ప్రత్యేక పేజీ కూడా కేటాయించి ఉంటారు.

  • Written By:
  • Publish Date - February 14, 2023 / 09:59 PM IST

Hawaii: రోడ్డు ప్రమాదాలు రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. ఏ న్యూస్‌ పేపర్‌ చూసినా.. నేరాలు-ఘోరాలకు ప్రత్యేక పేజీ కూడా కేటాయించి ఉంటారు. ఇక్కడ రహదారి ప్రమాదాలపైనే ఎక్కువ వార్తలు కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో.. గాల్లోకి ఎగిరే విమానాల ప్రమాదాలు కూడా పెరిగిపోయాయి. ప్రతి ఏడాదీ పదులు సంఖ్యలో ఘోరమైన ఘటనలు చూస్తున్నాం. భూమి మీద ప్రయాణాలు చేస్తూ…, దురుదృష్టవశాత్తు జరిగే ప్రమాదాల్లో పోతే శరీరమైన మిగులుతుంది చివరి చూపుకు. గాల్లో ఎగిరితే గాల్లోనే కలిసిపోతామనే భావన కొందరిలో ఉంది. నిజంగా చూస్తున్నాం కూడా.

తాజాగా విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన ఓ భారీ విమానం కొద్దిసేపటికే ఒక్క సారిగా కిందకు దిగిపోవడం మొదలైంది. ఒక దశలో సముద్రానికి కేవలం కొన్ని వందల అడుగుల ఎత్తుకు చేరుకొంది. మృత్యువు తప్పదని అందరూ భయపడ్డారు. పైలెట్లు కాళ్లు, చేతులు వణికిపోయాయి. కానీ, చివరి క్షణంలో విమానం పుంజుకోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నా రు. ఈ ఘటన హవాయిలో చోటు చేసుకొంది.

యునైటెడ్ ఎయిర్లైన్స్‌కు చెందిన ఫ్లైట్ నెంబర్ 1722 విమానం హవాయి నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్లింది. ఈ విమానం 2,200 అడుగుల ఎత్తుకు చేరే వరకు సాధారణంగానే ప్రయాణించింది. అందరూ ప్రశాంతంగా విమానంలో ప్రయాణం సాగిస్తున్నారు. కానీ, ఆ తర్వాత ఒక్క సారిగా 1,425 అడుగుల ఎత్తుకు పడిపోయింది. సముద్ర మట్టానికి కేవలం 800 అడుగుల ఎత్తుకు చేరింది. ఈ విషయాన్ని విమానాల రాకపోకలను పర్యవేక్షించే ఫ్లైట్రాడార్-24 గుర్తించింది. ఈ విమానం యాయి ద్వీ పం సమపంలో మళ్లీ పుంజుకొన్న ట్లు డేటా చెబుతోం ది.

ఆ విమానంలో ప్రయాణించిన రాడ్ విలియమ్స్ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ ఆ సమయంలో తాము రోలర్ కోస్టర్ ఎక్కి నట్లు అనిపించిందన్నారు. ప్రయాణికులు మొత్తం ప్రాణభయంతో కేకలు వేశారు. ఏదో అసాధారణ ఘటన జరగబోతోందని ప్రాణంపోయే అంచున ఉన్నామని అందరీ అర్థమైందని పేర్కొ న్నా డు. విమానం ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో భారీగా వర్షం, ఉరుములు, మెరుపులు వచ్చా యి. విమానం కొద్దిసేపు ఒడిదొడుకులకు లోనైనా.. చివరికి పుంజుకొని ప్రయాణం కొనసాగించందన్నారు.