Site icon HashtagU Telugu

Audio Leak Of Karnataka Minister: క‌ర్ణాట‌క బీజేపీలో మంత్రి ఆడియో లీక్ క‌ల్లోలం

Jc Madhuswamy

Jc Madhuswamy

కర్ణాటక మంత్రి ఆడియో లీక్ ఆ రాష్ట్ర రాజ‌కీయాల‌ను మ‌లుపుతిప్పేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌స్తుతం సీఎం బొమ్మైను మార్చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ న్యాయ‌శాఖ మంత్రి జేసీ మ‌ధు స్వామి ఆడియో లీక్ సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఆ ఆడియో క్లిప్ లో “మేము ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తున్నాము. న‌డిపించ‌డంలేదు”..అని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి మాట్లాడిన‌ట్టు ఉంది. మ‌రోవైపు ఈ మ‌ధ్య‌నే కర్ణాటక పర్యటనలో సీఎం మార్పు గురించి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి బొమ్మై ప‌ద‌విని కోల్పోయే ప్రమాదం లేదని ధృవీకరించారు. ఆ విష‌యాన్ని సాక్షాత్తూ మాజీ సీఎం యడియూరప్ప వెల్ల‌డించారు.

 

అయితే, ఆడియో క్లిప్ లోని వ్యాఖ్య‌ల‌తో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఎస్‌టి సోమశేఖర్‌ విభేదిస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తున్నామ‌ని మ‌ధుస్వామి భావిస్తే.. వెంటనే కర్ణాటక న్యాయ మంత్రిగా పదవీ విరమణ చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్‌లో భాగంగా ఉంటూ..కేబినెట్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఆమోదిస్తున్న ఆయ‌న‌, ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం బాధ్య‌తారాహిత్య‌మ‌ని అన్నారు.

Exit mobile version