Tamil Nadu : కావేరి డెల్టా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాం – తమిళనాడు సీఎం స్టాలిన్‌

త‌మిళ‌నాడులో అకాల వర్షాల వల్ల పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. రైతుల‌కు జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసిన మంత్రులు,

  • Written By:
  • Publish Date - February 6, 2023 / 07:51 AM IST

త‌మిళ‌నాడులో అకాల వర్షాల వల్ల పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. రైతుల‌కు జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసిన మంత్రులు, అధికారుల బృందం అందించిన ఇన్‌పుట్‌లను పరిశీలించిన తర్వాత కావేరి డెల్టా ప్రాంత రైతులకు సహాయం అందించడంపై తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తెలిపారు. డెల్టా జిల్లాలైన తంజావూరు, తిరుచిరాపల్లి, మైలాడుతురై, నాగపట్నం, తిరువారూర్, అరియలూరు, పుదుకోట్టై జిల్లాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని, వరితో పాటు కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నీట మునిగిన విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ప్రస్తుతం అకాల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పొలాల్లోకి నీరు చేరేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎంతమేర నష్టం జరిగిందనే దానిపై రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తుగా అక్కడికక్కడే అంచనా వేస్తున్నారు. అలాగే డెల్టా ప్రాంతాలను పరిశీలించి రైతులతో మాట్లాడి.. పంటల నష్టంపై సమాచారాన్ని తెలుసుకోవడానికి వ్యవసాయ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, మంత్రి ఆర్‌ శక్కరపాణి, ప్రభుత్వ ఉన్నతాధికారులను నియమించినట్లు స్టాలిన్ తెలిపారు. కావేరి డెల్టా ప్రాంతంలో అకాల వర్షాల కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని అధ్యయనం చేసిన మంత్రులు, అధికారుల ప్యానెల్ నుండి ఇన్‌పుట్‌లను పరిశీలించి రైతులకు పంట బీమా పరిహారం, ఉపశమనం అందించడంపై తగిన తదుపరి చర్యలుతీసుకుంటామ‌ని తెలిపారు. ఈ రోజు (ఫిబ్రవరి 6న) ప్యానెల్‌తో సమావేశం కానున్నట్టు స్టాలిన్ తెలిపారు.

కావేరి డెల్టా ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న సుమారు ఐదు లక్షల ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని తమిళనాడు రైతు సంఘాల సమన్వయ సమితి అధ్యక్షుడు పీఆర్‌ పాండియన్‌ శుక్రవారం తెలిపారు. రైతులు పంటకు బీమా చేశారని.. ఇవ్వాల్సిన పరిహారం అకాల వర్షాల వల్ల నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విపత్తు రెస్పాన్స్ ఫండ్ నుంచి నష్టపోయిన రైతులకు సాయం అందించాలని పాండియన్ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కోరారు.