Site icon HashtagU Telugu

Wayanad: వయనాడ్ విధ్వంసం.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

Wayanad

Wayanad

Wayanad: ప్రకృతి వైపరీత్యం కలిగిన కేరళలో వయనాడ్ (Wayanad) జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భారీ భూకంపాలు చోటు చేసుకున్నాయి. ఈ విధ్వంసంతో అనేక మంది అదృశ్యమయ్యారు. నేటి వరకు వారి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు అన్వేషణ కొనసాగిస్తుండగా బాధితుల కుటుంబ సభ్యులు, ప్రజలు కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.

Also Read: Kalki In Ott: ఈ నెలలోనే కల్కి ఓటీటీ రిలీజ్..? ఆ 6 నిముషాలు కట్ చేసారు అని టాక్

చెలియార్ నది సమీపంలోని ముండేరి, కొట్టుపర ప్రాంతాల్లో రెండు మృతదేహాలను క‌నుగొన్నారు. అలాగే సూచిప్పర వాటర్ ఫాల్స్ సమీపంలో మరో రెండు మృతదేహాలు గుర్తించారు. ఈ మృతదేహాలను అధికారుల సహాయంతో నిలాంబుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇంకా మరికొన్ని మృతదేహాల లభించవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముండక్కై, చూరల్మల, పున్చిరిమట్ట, చలియార్ నది పరివాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలను పెంచారు. ప్రత్యేక బృందాలు కాంతన్‌పరా, సూచిప్పర్ వద్ద గాలింపు కొనసాగిస్తున్నాయి. కొండ చరియల క్రింద ఇంకా మృతదేహాలు ఉన్నాయని భావిస్తున్నారు. అందుకే ఆ ప్రాంతాల్లో కూడా గాలింపు చేపడుతున్నారు. ఈ విపత్తులో మరణించిన వారి డీఎన్ఏ నివేదికలు నేటి నుంచి అందుబాటులో ఉంటాయని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె. రాజన్ తెలిపారు. ఈ డీఎన్ఏ ఫలితాల ఆధారంగా వారి కుటుంబ సభ్యులను గుర్తించగలగాలని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలు ఆగస్ట్ నెలలో కూడా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.