తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది.
భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో విఐపిలు కూడా తిరుమల యాత్ర విషయం పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టిటిడి కోరుతోంది. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ కారణంగా క్యూ లైన్ లో వచ్చే భక్తులకు టీటీడీ నిరంతరం నీళ్ళు, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు.
