Site icon HashtagU Telugu

Nadigar Sangam elections 2019: విశాల్ ప్యానల్ గ్రాండ్ విక్ట‌రీ..!

Nadigar Sangam Elections Vishal Panel

Nadigar Sangam Elections Vishal Panel

త‌మిళ‌నాడు సినిమా ఇండ‌స్ట్రీ నడిగర్ సంఘం ఎన్నికల్లో సినీ నటుడు నాజర్ సారథ్యంలోని పాండవర్ జట్టు విజయభేరీ మోగించింది. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీలు గెలుపొందారు. అలాగే, ఉపాధ్యక్షులుగా పోటీ చేసిన పూచ్చి మురుగను, కరుణాస్‌లు కూడా గెలుపొందారు. నడిగర్ సంఘానికి మూడేళ్ల క్రితం 2019 జూలై 23న ఎన్నికలు నిర్వహించారు.

ఈ క్ర‌మంలో ఒక ప్యానల్ నుంచి నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా పోటీ చేశారు. ఇక మరో ప్యానల్ నుంచి భాగ్యరాజ్, సెక్రటరీగా గణేషన్ పోటీలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హీరో విశాల్‌తో పాటు ప‌లువురు అక్రమాలకు పాల్పడినట్టు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గ‌త మూడేళ్ళుగా ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌లేదు. అంతే కాకుండా ఎలక్షన్ నిర్వహించిన బాక్సులను బ్యాంకు లాకర్‌లో భద్రపరిచారు.

అయితే నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ సహా ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని మ‌ద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును నటుడు ఏళుమలై సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. దీంతో మద్రాస్ హైకోర్టు ఆదేశం మేరకు ఎన్నికల అధికారి రిటైర్జ్ జడ్డి పద్మనాభన్ సక్షమంలో ఆదివారం చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న గుడ్ షెపర్డ్ కాన్వెంట్ స్కూలులో ఓట్లను లెక్కించారు. ఈ నేప‌ధ్యంలో తొలుత పోస్టల్ ఓట్లను లెక్కించ‌గా ఇందులో నాజర్ సారథ్యంలోని పాండవర్ జట్టు సభ్యులు ఆధిపత్యాన్ని చెలాయించారు.

ఇక ఆ తర్వాత పోలైన బ్యాలెట్లను లెక్కించగా, ఇందులోనూ పాండవర్ జట్టు సభ్యులే గెలిచారు. ఫ‌లితంగా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా విశాల్, ట్రెజరర్‌గా కార్తీ విక్టరీ సాధించారు. మిగిలిన పోస్టులకు కూడా పాండవర్ జట్టుకు చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో నడిగర్ సంఘం ఎన్నికలపై గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. పాండవర్ జట్టు ప్రత్యర్థిగా జట్టు స్వామి శంకర్ దాస్ ప్యానెల్ తరపున అధ్యక్ష పదవి కె.భాగ్యరాజ్, ప్రధాన కార్యదర్శి పదవికి ఐసరి గణేష్, కోశాధికారిగా ప్రశాంత్‌లు పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే.