Viral Video: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుద్దిన గంగిరెద్దు.. తప్పిన ప్రమాదం, వీడియో వైర‌ల్‌

సోష‌ల్ మీడియాలో ఓ వీడియో తెగ వైర‌ల్ (Viral Video) అవుతోంది. బెంగళూరు మహాలక్ష్మి లేఔట్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఒక్కసారిగా గంగిరెద్దు గుద్దడంతో పక్కనే వెళ్తున్న లారీ కింద పడ్డాడు.

Published By: HashtagU Telugu Desk
Viral Video

Safeimagekit Resized Img (5) 11zon (1)

Viral Video: సోష‌ల్ మీడియాలో ఓ వీడియో తెగ వైర‌ల్ (Viral Video) అవుతోంది. బెంగళూరు మహాలక్ష్మి లేఔట్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఒక్కసారిగా గంగిరెద్దు గుద్దడంతో పక్కనే వెళ్తున్న లారీ కింద పడ్డాడు. లారీ డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయటంతో కింద పడ్డ వ్యక్తికి త్రుటిలో ప్రమాదం తప్పింది. లేకుంటే ఆ వ్య‌క్తి ప్రాణాలు పోయేవి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెంగుళూరు నుండి షాకింగ్ CCTV ఫుటేజ్ వ‌చ్చింది. దీనిలో స్కూటర్ రైడర్ రోడ్డుపై వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎదురుగా ఎడమవైపు నుంచి ఒక ఎద్దు, కుడివైపు నుంచి ట్రక్కు వెళ్తోంది. అకస్మాత్తుగా ఏదో తెలియని కారణాల వల్ల ఎద్దు తన కొమ్ముల‌తో స్కూటర్ రైడర్‌పై దాడి చేసింది. ఆ తర్వాత స్కూటర్‌తో పాటు కుడివైపు పడిపోయాడు.

అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్‌ ఈ ఘటనను గమనించి వెంటనే బ్రేకులు వేశాడు. ట్రక్ ఆగినప్పుడు, స్కూటీ రైడర్ తల పైభాగం ట్రక్కు ముందు, వెనుక చక్రాల మధ్య ఉన్నాయి. భయాందోళనకు గురైన స్కూటర్ రైడర్ వెంటనే లేచి కూర్చున్నాడు. అయితే అప్పటికి లారీ కూడా ఆగింది. దీంతో ఆ వ్యక్తి ట్రక్కు టైరు కింద ప‌డ‌కుండా తృటిలో బయటపడ్డాడు. అతని జీవితానికి మరణానికి మధ్య కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. ఈ ఘటన జరుగుతున్న తీరును గమనించిన డ్రైవర్ అప్రమత్తమైన కళ్లు ఏమాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే బ్రేక్‌లు వేశాడు.

Also Read: Delhi Excise Case: సీబీఐకి చేతికి కవిత, కోర్టు అనుమతి

ప్రమాదం సమయంలో ఒక మహిళ కూడా ఎద్దుతోపాటు నడుస్తోంది. అయితే ఆ మహిళకు బదులు ఎద్దు ఎదురుగా వస్తున్న స్కూటర్ రైడర్‌ని త‌న కొమ్ముల‌తో దాడి చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత మహిళ కూడా భయపడి పక్కకు వెళ్లిపోయింది. ఇదంతా చాలా త్వరగా జరిగిపోయింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 05 Apr 2024, 05:38 PM IST