Site icon HashtagU Telugu

Crow Attack: తగ్గేదే లే… అంటున్న ‘కాకి’, పగబట్టి మరీ కొందరిపై దాడి..!

crow

crow

పగలు, ప్రతీకారాలు అనేవి మనుషుల్లోనే ఉన్నాయనుకోకండి సుమీ.. కొన్ని పక్షుల్లోనూ ఉన్నాయని తెలుసుకోండి. సహజంగా అయితే మనుషుల్లోనే ఎక్కువగా రివేంజ్ స్టోరీలను చూస్తూ ఉంటాం. కాకపోతే, ఇప్పుడు పక్షిజాతికి చెందిన దాంట్లోనూ పగను చూడాల్సి వచ్చింది. ఇంతకీ నేను చెబుతున్న పక్షి ఏదో కాదండీ… అదేనండి…ఓ కాకి. అవును… మీరు విన్నది నిజమే. కాకులు కూడా పగబడతాయా..? పగబట్టి అవి ప్రతీకారం తీర్చుకుంటాయా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామస్థులు.

ఆ గ్రామంలో కొందరిపై కాకి పగబట్టి మరీ దాడి చేస్తోందని వారు వాపోతున్నారు. దానికి భయపడి ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓబళాపురం గ్రామంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఓ ‘కాకి’… ఆ గ్రామంలోని కొందరిని మాత్రమే టార్గెట్ గా చేసుకుందట. వారు ఎంతమందిలో ఉన్నా సరే, ఎగిరొచ్చి మరీ వారిపైనే దాడి చేస్తోందట. దానికున్న గోళ్లతో గీకుతూ, ముక్కుతో పొడుస్తోందని వారు చెబుతున్నారు. మొత్తంమీద ఓబళాపురం విలేజ్ లోని ఏడుగురి పై మాత్రమే, అది పగబట్టి దాడి చేస్తోందని గ్రామస్థులు వెల్లడించారు. పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్న ఆ ‘కాకి’ ని గ్రామం నుంచి బయటికి తరిమేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా.. అది వెళ్లడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. అయితే ఆ ‘కాకి’.. ఆ గ్రామంలోని…

ఆ ఏడుగురిపైనే ఎందుకు పగబట్టింది… వారిని మాత్రమే టార్గెట్ గా చేసుకుని ఎందుకు వారిపైనే దాడిచేస్తోందనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బహుశా పోయిన జన్మలోనో… లేదంటే ఈ జన్మలోనే దాన్ని ఆ ఏడుగురు ఏమైనా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. ఏదిఏమైనా కూడా… ఈ ‘కాకి’ మాత్రం ఓ రేంజ్ లో రివేంజ్ తీసుకుంటుంది కదా…! దీనమ్మ తగ్గేదే..లే అంటోంది.