Site icon HashtagU Telugu

Kalaburgi: బుర్కా ధరిస్తేనే బస్సులోకి అనుమతి, డ్రైవర్ పై గ్రామస్తుల ఆగ్రహం

Hijab

Hijab

Kalaburgi: కర్నాటకలోని కలబురగి జిల్లాలో ఒక బస్సు డ్రైవర్ పాఠశాల విద్యార్థినులను బురఖాలో ఉంటే తప్ప బస్సు ఎక్కించడానికి నిరాకరించినందుకు ఆగ్రహానికి కారణమయ్యాడు. విద్యార్థులు రోజూ పాఠశాలకు వెళ్లేందుకు కమలాపూర్ తాలూకాలోని ఓకలి గ్రామం నుంచి బసవకల్యాణ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. బసవకల్యాణ్-కలబురగి మార్గంలో నడిచే బస్సు డ్రైవర్, బస్సు ఎక్కే ముందు ముస్లిం బాలికలందరూ బురఖాలు ధరించాలని డిమాండ్ చేశారు. ముస్లీం విద్యార్థులకు బురఖాలు మాత్రమే ఆమోదయోగ్యమని డ్రైవర్ పేర్కొంటూ హిజాబ్ (తల కండువా) ధరించిన వారికి కూడా ప్రవేశం ఉండదని చెప్పాడు. అమ్మాయిలు అందుకు అంగీకరించకపోవడంతో వారిని దూషించి బస్సు ఎక్కకుండా ప్రయత్నించాడని తెలుస్తోంది. దీంతో ఇతర ప్రయాణికులు డ్రైవర్‌ను నిలదీయగా.. బస్సు పని చేసే స్థితిలో లేదని,  విద్యార్థులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని పేర్కొనడం గమనార్హం.

Also Read: Army Helicopters: జలదిగ్భంధంలో మోరంచపల్లి గ్రామం, రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు!