తమిళ్ హీరో విజయ్ (Vijay) రీసెంట్ గా తన పొలిటికల్ ఎంట్రీ ని ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri Kalagam) పేరుతో కొత్త పార్టీ ని ప్రకటించారు. 2026 ఎన్నికలను టార్గెట్ గా ఆయన బరిలోకి దిగబోతున్నాడు. ఈ లోపు ప్రస్తుతం ఒప్పుకున్నా సినిమాలను త్వరగా పూర్తి చేసి..రాజకీయాల ఫై పూర్తిగా దృష్టి పెట్టాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే.. విజయ్ ప్రకటించిన పార్టీ కి సంబదించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
తమిళగ వెట్రి కళగం పార్టీ పేరులో స్వల్ప మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ పేరులో అదనంగా ‘క్’ అనే అక్షరాన్ని యాడ్ చేయాలనీ భావిస్తున్నారట. పార్టీని ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. దీనిపై తమిళనాడులోని కొన్ని పార్టీల నుండి వ్యతిరేకత వస్తోంది. దీంతో విజయ్ తన పార్టీ పేరులో చేంజ్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తమిళనాట తమిళగ వాల్వురిమై కట్చి అనే పేరుతో ఇప్పటికే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీని కూడా ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. ఇక విజయ్ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండటంతో తమకు ఇబ్బంది కలుగుతుందని వారు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం పేరులో ‘క్’ అనే అక్షరాన్ని జోడించాలని నిర్ణయించుటకున్నారట. దీంతో ఇక నుండి తమిళగ వెట్రిక్ కళగం అని పిలవాలని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
Read Also : Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?