తమిళ నటుడు, వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్ (Thalapathy Vijay) చెన్నైలో ఇఫ్తార్ విందు (Host Iftar Party) ఏర్పాటు చేశారు. YMCA మైదానంలో నిర్వహించిన ఈ విందులో ముస్లింలకు ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చి, వారికి భోజనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విజయ్ ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రంజాన్ మహోత్సవం ప్రాముఖ్యతను వివరించారు.
RT76 : రవితేజకు జోడిగా ఆ ఇద్దరు భామలు
విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత మత సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ ధర్మాలపై సమానమైన గౌరవాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇఫ్తార్ విందుకు విజయ్ స్వయంగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షకు ముగింపు పలకడం విశేషం. ఇది తన పార్టీ సిద్ధాంతాలకు, సమాజంలో అగ్రగామి సామరస్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
విజయ్ ఈ విందులో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీవీకే కార్యకర్తలు, అభిమానులు ఈ చిత్రాలను విస్తృతంగా పంచుకుంటున్నారు. ముస్లిం సోదరులతో కలిసి విజయ్ ప్రార్థనలు చేయడం, వారితో సమానంగా పంక్తిలో కూర్చొని భోజనం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో విజయ్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరవ్వాలని యత్నిస్తున్నారు. ముస్లింలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయడం, వారితో సాన్నిహిత్యం పెంచుకోవడం తమిళనాడులో తన రాజకీయ హవాను మరింతగా పెంచుకోవడానికా? అనే చర్చ మొదలైంది. విజయ్ మెల్లగా తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపించేలా ముందుకు వెళ్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.