Site icon HashtagU Telugu

Rakesh Tikayat : రైతు నాయ‌కుడు తికాయ‌త్ పై బీజేపీ దాడి

Rakesh Tikayat

Rakesh Tikayat

వ్య‌వ‌సాయ న‌ల్ల చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ పోరాడిన రైతు నాయ‌కుడు రాకేష్ తికాయ‌త్ పై బీజేపీ దాడి చేసింది. పదుల సంఖ్యలో గదిలోకి ప్రవేశించి తికాయ‌త్ పై సిరాతో దాడి చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. “మోదీ, మోడీ అంటూ నినాదాలు చేస్తూ కుర్చీలతో దాడి చేశారు. భద్రత కల్పించకపోవడాన్ని బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వైఫ‌ల్యం కింద తికాయ‌త్ ఆరోపిస్తున్నారు.

స్థానిక పోలీసులు ఎటువంటి భద్రత కల్పించలేదు. ప్రభుత్వంతో కుమ్మక్కయ్యిందని తికాయ‌త్ విమ‌ర్శించారు. భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేష్ తికైత్ సోమ‌వారం బెంగుళూరు ప‌ర్య‌ట‌న‌కు వచ్చారు. కర్నాటక రైతు నాయకుడు లంచం అడుగుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్టు చేసిన‌ స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేందుకు వ‌చ్చారు. ఆ విష‌యంపై మీడియాలో ఆయ‌న మాట్లాడుతున్న‌ప్ప‌పుడు హ‌ఠాత్తుగా ఆయ‌న‌పై భారతీయ జనతా పార్టీ (బిజెపి) సభ్యులు, మద్దతుదారులు నల్ల ఇంకు మొఖానికి పూసారు.