కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ పట్టణంలో ఉన్న ఒక దర్గా పై వివాదం రాచుకుంది. అది ఒకప్పుటి హిందూ ఆలయమని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ వ్యాఖ్యానించారు. ” ప్రస్తుతం బసవ కళ్యాణ్ పట్టణంలో ఉన్న దర్గా.. గతంలో బసవన్న కు చెందిన అనుభవ మంటపం. నిజాం నవాబు కాలంలో బసవన్న ఆలయాన్ని ఆక్రమించి దర్గాగా మార్చారు” అని పేర్కొన్నాడు.
” దర్గా భవనంలో ఉన్న పుష్కరిణి, కలశాలే అది ఒకప్పటి ఆలయం అనేందుకు నిదర్శనాలు” అని ఆయన చెప్పారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బసవన్న భక్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దర్గాగా మారిన ఆలయాన్ని తిరిగి గుడిగా మార్చాలని కోరుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి.