Kerala: కేరళ లో వెరైటీ ఫెస్టివల్.. మగోళ్లు ఆడవాళ్లుగా మారి!

  • Written By:
  • Updated On - March 27, 2024 / 09:36 AM IST

Kerala: ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే కేరళకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ జరిగే పూజలు, వ్యవహరాలు చాలా భిన్నంగా ఉంటాయి.  పురుషులు తమ వేషధారణ మార్చి మహిళలు సైతం కుళ్ళుకునేలా అందంగా తయారవడం ఈ ఫెస్టివల్ ప్రత్యేకత. కేరళలోని కొల్లం లో ఉన్న కొట్టన్‌కులంగర శ్రీ దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే చమయంవిళక్కు ఉత్సవం జరుగుతుంది. పురుషులు తమ మీసాలు తీయడం, చీరలు ధరించడం, ఆభరణాలతో అందంగా అలంకరించుకోవడం స్పెషల్ అట్రాక్షన్

పండుగ సమయంలో, స్త్రీల వేషధారణలో పురుషులు తమ చేతుల్లో దీపాలతో ఊరేగింపుగా వస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల నుంచి ఈ ఆలయానికి వచ్చిన పురుషులు ఊరేగింపులో చేరి, చీరలు, ఆభరణాలు ధరించి, మేకప్ వేసుకుని అందంగా ముస్తాబై ఈ విశిష్టమైన ఆచారంలో పాల్గొంటారు.

పురుషులు తమ చేతులతో చమయవిలక్కు (సాంప్రదాయ దీపం) పట్టుకుని, అధిష్టాన దేవత పట్ల వారి భక్తికి చిహ్నంగా ఆలయం చుట్టూ తిరుగుతారు మరియు వారి కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. చమయవిళక్కు పూజ రెండు రోజులు ఉంటుంది .సాయంత్రం ప్రారంభమై తెల్లవారుజాము వరకు జరుగుతుంది.