Kamala Harris : కమలా హ్యారిస్ అమ్మమ్మ ఊరిలో ప్రత్యేక పూజలు.. తులసేంద్రపురం గురించి తెలుసా ?

కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయ వనతి. తండ్రి డొనాల్డ్ హారిస్(Kamala Harris) జమైకా దేశస్తుడు.

Published By: HashtagU Telugu Desk
Us Elections 2024 Kamala Harris Thulasendrapuram Tamil Nadu

Kamala Harris : డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె ఈ ఎన్నికల్లో గెలవాలని, అమెరికా అధ్యక్షురాలు కావాలని అక్కడి ప్రజలు భగవంతున్ని కోరుకున్నారు. ఇంతకీ తులసేంద్రపురంతో కమలకు ఉన్న అటాచ్‌మెంట్ ఏమిటి ? ఆ ఊరిలో కమల సంబంధీకులు ఎవరున్నారు?

Also Read :Japan : జపాన్‌లో ఆటోమేటిక్‌ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ.. ఎలా పనిచేస్తుంది ?

  • కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయ వనతి. తండ్రి డొనాల్డ్ హారిస్(Kamala Harris) జమైకా దేశస్తుడు.
  • శ్యామలా గోపాలన్ తమిళనాడు వనిత.
  • శ్యామల తండ్రి గోపాలన్‌ తమిళనాడులోని తులసేంద్రపురం వాస్తవ్యులు. ఆయన భారత ప్రభుత్వ అధికారిగా వివిధ హోదాల్లో పని చేశారు.
  • కమల తల్లి శ్యామల 19 ఏళ్ల వయసులోనే అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్కడ రొమ్ము క్యాన్సర్‌పై ఆమె రీసెర్చ్ చేశారు.
  • అమెరికాలో ఉండగా జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో శ్యామలకు ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి తొలి సంతానం కమల.
  • కమల జన్మించిన తొలినాళ్లలో తులసేంద్రపురానికి శ్యామల వచ్చి వెళ్లారు.  ఆ సమయంలోనే ఈ ఊరిలోని తన  అమ్మమ్మ, తాతయ్యలను కలిసే అవకాశాన్ని కమలా హ్యారిస్ దక్కించుకున్నారు.
  • 2014లో కమలా హ్యారిస్ బంధువులు ఆమె పేరిట తులసేంద్రపురంలోని 300 ఏళ్ల నాటి ప్రాచీన గుడికి విరాళం ఇచ్చారు. గుడి శిలాఫలకాలపై హారిస్‌ పేరును ప్రచురించారు.
  • తులసేంద్రపురంలోని ఓ నీటి ట్యాంకుకు కమలా హ్యారిస్ పేరు పెట్టారు.
  • త్వరలో ఆ గ్రామంలో నిర్మించే బస్టాప్‌కు కూడా కమల పేరే పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
  • తాజాగా కమల ఫొటోలతో తులసేంద్రపురంలో ఫ్లెక్సీలు వెలిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె గెలవాలని స్థానికులు పూజలు చేస్తున్నారు.
  • కమల సుదూరంలో ఉన్నా.. తులసేంద్రపురం ప్రజలు చూపుతున్న అభిమానాన్ని చూసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :Yama Dwitiya 2024 : అపమృత్యు దోషం తొలగేందుకు యముడు చెప్పిన సీక్రెట్.. రేపే ‘యమ ద్వితీయ’

  Last Updated: 02 Nov 2024, 02:36 PM IST