Site icon HashtagU Telugu

Karnataka Controversy: కర్నాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా

Eshwarappa Imresizer

Eshwarappa Imresizer

కర్నాటక మంత్రి కే.ఎస్ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు కారణమైన వివాదం నేపథ్యంలో శుక్రవారం రాత్రి సీఎం బసవరాజ్ బొమ్మైకి రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో కే.ఎస్ ఈశ్వరప్పతోపాటు మంత్రులు బైరతి బసవరాజ, ఎంటబీ నాగరాజ్, ఆరగ జ్జానేంద్ర , ఎమ్మెల్యే రమేష్ జార్కి హెలి తదితరులు ఉన్నారు.

రాజీనామా చేసే ముందు ఈశ్వరప్ప కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తానేంటో నిరూపించుకుని మళ్లీ మంత్రిని అవుతానంటూ తెలిపారు. కాంట్రాక్టర్ సంతోష్ ఆత్మహత్య లేఖలో తన పేరు ఉండటం కుట్రపూరితమే అన్నారు. నాపై ఆరోపణలు మోసారు. వాటికి క్లియర్ చేసుకోవల్సిన అవసరం ఉంది. నిర్దోషిగా బయటకు వస్తా…ఒకవేళ మంత్రి పదవిలో కొనసాగితే..నేను విచారణను ప్రభావితం చేస్తానన్న అపవాదు వస్తుంది. అందుకే రాజీనామా చేస్తున్నాను. కానీ నేను నిర్దోషినే…మరోసారి మంత్రినవుతానంటూ ఈశ్వరప్ప పేర్కొన్నారు.

అయితే మంత్రి ఈశ్వరప్ప ఒత్తిళ్లు, బెదిరింపులు తాళలేక రెండు రోజుల క్రితం సంతోష్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం…కర్నాటక రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. మంత్రి ఈశ్వరప్ప ఒత్తిడి తాళ్లలేకే ఆత్మహత్యకు పాల్పడుతన్నట్లు సంతోష్ పాటిల్ తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఈశ్వరప్పను…ఆయన సన్నిహితులపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో…ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాడ్ చేసింది. అంతేకాదు భారీగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది.

https://twitter.com/ikseshwarappa/status/151502072100071014